కోవిడ్-19 వైరస్‌ను కట్టడి చేసేందుకు అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ను కొన్ని సడలింపులతో జూన్ 28 వరకు పొడిగిస్తున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న లాక్‌డౌన్ ఈ నెల 21 ఉదయం 6 గంటలతో ముగియనుంది. 

Also Read:ఇండియాలో తగ్గుముఖం పట్టిన కరోనా, మరణాలు

ప్రస్తుతం అనుమతించదగిన కార్యకలాపాలను అనుమతిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. కూరగాయలు, పండ్లు, చేపలు, మాంసం దుకాణాలను ఉదయం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు తెరవవచ్చునని వెల్లడించింది. ఇంటర్ సిటీ బస్ ట్రాన్స్‌పోర్ట్‌ను చెన్నై సహా నాలుగు జిల్లాల్లో అనుమతిస్తున్నట్లు తెలిపింది. 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో బస్సులను నడపవచ్చునని ప్రభుత్వం తెలిపింది. మెట్రో రైలు సేవలు కూడా 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. ఈ-రిజిస్ట్రేషన్ లేకుండా ఆటోరిక్షాలు, రెంటల్ క్యాబ్‌లను నడపవచ్చునని వెల్లడించింది.