ఇండియాలో కరోనా కేసులు  రోజు రోజుకి తగ్గిపోతున్నాయి. గత 24 గంటల్లో  58,419 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కరోనాతో 1576 మంది మరణించారు.


న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా కేసులు రోజు రోజుకి తగ్గిపోతున్నాయి. గత 24 గంటల్లో 58,419 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కరోనాతో 1576 మంది మరణించారు.దేశంలో ఇప్పటివరకు 39,10, 19, 083 మంది శాంపిల్స్ పరీక్షించారు. ఈ నెల 19వ తేదీన 18,11,446 శాంపిల్స్ పరీక్షిస్తే వీరిలో 58,419 మందికి కరోనా సోకింది. 

ఇండియాలో కరోనా కేసుల రికవరీ 96.27 శాతానికి పెరిగింది. కరోనా పాజిటివిటీ రేటు 3.22 శాతానికి పడిపోయింది. దేశంలో కరోనా కేసుల సంఖ్య 2,98,81,966కి చేరుకొంది. కరోనా నుండి ఇప్పటివరకు 2,87,66,009 మంది కోలుకొన్నారు. దేశంలో ఇంకా 7,29, 243 యాక్టివ్ కేసులున్నాయి. ఇండియా వ్యాప్తంగా 27,66, 93, 572 మందికి వ్యాక్సినేషన్ చేశారు.

 దేశంలో పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధించాయి. ఈ లాక్‌డౌన్ కారణంగా కరోనా కేసులు భారీగా పడిపోయాయి. చాలా రాష్ట్రాలు అన్‌లాక్ దిశగా ముందుకు వెళ్తున్నాయి. ఈ తరుణంలో కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రప్రభుత్వం ఆయా రాష్ట్రాలను హెచ్చరించింది.