తమిళనాడు గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ ఆదివారం నాడు కరోనా సోకింది. ఇప్పటికే తమిళనాడు రాజ్ భవన్ లో  87 మంది సిబ్బందికి కరోనా సోకింది. దీంతో ఆయన ఇప్పటికే ఐసోలేషన్ లో ఉన్నాడు.తమిళనాడు రాజ్ భవన్ లో మరో ముగ్గురికి కరోనా సోకింది. దీంతో  గవర్నర్  భన్వర్ లాల్ పురోహిత్ జూలై 29వ తేదీన స్వీయ నిర్భంధంలోకి వెళ్లారు. 

 వారం క్రితం రోజుల పాటు ఆయన స్వీయ నిర్భందంలో ఉండనున్నారు.  రెండు వారాల క్రితం రాజ్ భవన్ లో పనిచేసే ఉద్యోగులను పరీక్షిస్తే 84 మందికి కరోనా సోకినట్టుగా తేలింది. వీరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.  తాజాగా మరో ముగ్గురికి కరోనా సోకింది.

also read:మరో ముగ్గురికి కరోనా: స్వీయ నిర్భంధంలోకి గవర్నర్

కరోనా బారినపడిన వారిలో ఎక్కువ మంది ఫైర్, సెక్యూరిటీ సిబ్బంది ఉన్నట్టుగా రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి. రాజ్ భవన్ లో పనిచేసే ఉద్యోగులు కరోనా బారిన పడడంతో గవర్నర్ భన్వర్ లాల్ పురోహిత్ ఇవాళ్టి నుండి వారం రోజుల పాటు స్వీయ నిర్భంధంలో ఉండనున్నారు.

గవర్నర్ కు జూలై 28వ తేదీన  వైద్యులు పరీక్షలు నిర్వహించారు. గవర్నర్ పూర్తి ఆరోగ్యంగా, ఫిట్ గా ఉన్నట్టుగా వైద్యులు ప్రకటించారు. సాధారణ పరీక్షల్లో భాగంగానే వైద్యులు గవర్నర్ కు పరీక్షలు చేశారు.వైద్యుల సూచన మేరకు గవర్నర్ స్వీయ నిర్భంధంలోకి వెళ్లారు.