Omicron Scare: కరోనాతో ఆస్పత్రిలో చేరిన ఆరుగురు.. ఆ సంకేతాలతో ఒమిక్రాన్ టెన్షన్..

భారత్‌లో ఒమిక్రాన్ కేసులు (Omicron cases in india) క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు తమిళనాడులో (tamil nadu) ఒమిక్రాన్ వేరియంట్ కేసులు వెలుగుచూడనప్పటికీ.. తాజాగా అక్కడ ఒమిక్రాన్ టెన్షన్ నెలకొంది. 
 

Tamil Nadu flyer from Nigeria and his relatives suspected for Omicron variant

భారత్‌లో ఒమిక్రాన్ కేసులు (Omicron cases in india) క్రమంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రాలో అత్యధికంగా 28 ఒమిక్రాన్ కేసులు వెలుగుచూడగా.. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 57కు చేరింది. ఇప్పటివరకు తమిళనాడులో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు వెలుగుచూడనప్పటికీ.. తాజాగా అక్కడ ఒమిక్రాన్ టెన్షన్ నెలకొంది. నైజీరియా (Nigeria) నుంచి చెన్నై చేరుకున్న 47 ఏళ్ల వ్యక్తికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్దారణ అయింది. అతడు నైజీనియా నుంచి దోహా మీదుగా డిసెంబర్ 10న తిరుచిరాపల్లికి (Tiruchirapalli) చేరుకున్నాడు. అతనికి నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలిందని.. తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణియన్ (Subramanian) మంగళవారం తెలిపారు. అయితే పరీక్షల్లో ఎస్‌ జీన్‌ డ్రాప్ (S-gene drop) ఉండటం అతనికి ఒమిక్రాన్ సోకిందనే సంకేతాలు కనిపిస్తున్నాయని అన్నారు. మరోవైపు అతడి బంధువుల్లో 5గురికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ కావడం ఆందోళన కలిగిస్తుంది. 

ప్రస్తుతం వీరందరిని కోవిడ్-19 ఆస్పత్రికి తరలించినట్టుగా మంత్రి సుబ్రమణియన్ తెలిపారు. అయితే నైజీరియా నుంచి వచ్చిన వ్యక్తికి ఎలాంటి లక్షణాలు లేవని.. అయితే వారందరిలో ఎస్ జీన్ డ్రాప్ అవుట్ ఉందని చెప్పారు. వారి శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపినట్టుగా వెల్లడించారు. కోవిడ్ పాజిటివ్‌గా నిర్దారణ అయిన వ్యక్తుల్లో Omicron వేరియంట్ సోకిన విషయం తెలియాలంటే.. బెంగళూరులోని INSTEM ల్యాబ్ నుంచి ధ్రువీకరణ రావాల్సి ఉందని చెప్పారు. ఒకవేళ వీరిలో ఒమిక్రాన్ నిర్దారణ అయితే రాష్ట్రంలో ఇవే తొలి కేసులు కానున్నాయని చెప్పారు. 

ఎట్ రిస్క్ జాబితాలోని దేశాల నుంచి వస్తున్న ప్రయాణికులందరికి పరీక్షలు నిర్వహిస్తున్నామని మంత్రి వెల్లడించారు. డబ్ల్యూహెచ్, ఐసీఎంఆర్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ పరీక్షలు చేపడుతున్నామని తెలిపారు. ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల్లో 2 శాతం మంది నుంచి రాండమ్‌గా శాంపిల్స్ సేకరించి పరీక్షలు చేపడుతున్నామని చెప్పారు. ఇప్పటివరకు 11 ఎట్ రిస్క్ దేశాల నుంచి తమిళనాడుకు వచ్చిన 11,459 మంది ప్రయాణికులకు, ఇతర దేశాల నుంచి వచ్చిన 1,699 మంది ప్రయాణికులకు కరోనా పరీక్షలు నిర్వహించినట్టుగా చెప్పారు. ఇందులో 37 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయినట్టుగగా తెలిపారు. 

at risk దేశాల నుంచి వస్తున్న ప్రయాణికులు ఆర్టీపీసీఆర్ పరీక్షల ఫలితాలు వచ్చేవరకు ఎయిర్‌పోర్ట్‌లోనే ఉంచుతున్నట్టుగా మంత్రి సుబ్రమణియన్ తెలిపారు. ఇతర దేశాల నుంచి వస్తున్న ప్రయాణికులను మాత్రం టెస్ట్‌ల కోసం శాంపిల్స్ సేకరించిన తర్వాత ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకు వెళ్లేందుకు అనుమతిస్తున్నట్టుగా చెప్పారు. 

‘నైజీరియా నుంచి వచ్చిన ప్రయాణికుడు ఇంటికి వెళ్లాడు. అతనికి పరీక్షల్లో పాజిటివ్‌ రావడంతో ఆస్పత్రికి తరలించాం. వెంటనే అతని బంధువులను కూడా పరీక్షలు నిర్వహించాం. తొలుత వారికి నెగిటివ్ వచ్చింది. కానీ కొద్ది గంట్లోనే వారిలో కొద్దిపాటి లక్షణాలు కనిపించాయి. రెండో సారి నిర్వహించిన ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో వారికి పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో ఆరోగ్య అధికారులు, జిల్లా వైద్యాధికారులు, ఎయిర్‌పోర్ట్ హెల్త్ టీమ్.. అతనితో పాటు ప్రయాణించిన ప్రయాణికులను, క్లోజ్ కాంటాక్ట్స్‌ను, విమాన సిబ్బందిని అలర్ట్ చేశాయి’ అని తెలిపారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios