యూసీసీకి ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఆమోదం.. ‘జై శ్రీరామ్’ అంటూ.. బిల్లులో కీలకాంశాలు ఇవే..
ఉత్తరాఖండ్ (Uttarakhand) అసెంబ్లీ యూసీసీ (UCC) బిల్లుకు ఆమోద ముద్ర వేసింది. (Uttarakhand Assembly approves UCC) ఇక ఈ బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించనున్నారు. రాష్ట్రపతి సంతకం చేసిన వెంటనే ఈ బిల్లు చట్టంగా మారనుంది. అన్నీ సక్రమంగా జరిగితే స్వతంత్రం అనంతరం యూసీసీ (Uniform Civil Code) అమల్లోకి వచ్చిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలవనుంది.
చారిత్రాత్మక యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) బిల్లును ఉత్తరాఖండ్ అసెంబ్లీ బుధవారం ఆమోదించింది. జై శ్రీరామ్ నినాదాల మధ్య వాయిస్ ఓటు ద్వారా బిల్లుకు ఆమోదం లభించింది. మంగళవారం ఈ బిల్లును ఉత్తరాఖండ్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. బిల్లుకు అసెంబ్లీ ఆమోద ముద్ర వేయడంతో ఇక రాష్ట్రపతి సంతకం చేయడమే మిగిలింది. ఆ ప్రక్రియ కూడా పూర్తయితే స్వాతంత్ర్యం తర్వాత యూసీసీ అమల్లోకి వచ్చిన రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలుస్తుంది. మతంతో సంబంధం లేకుండా పౌరులందరికీ ఒకే వివాహం, విడాకులు, భూమి, ఆస్తి, వారసత్వ చట్టాలను ఏర్పాటు చేసే లక్ష్యంతో ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఈ బిల్లును ప్రవేశపెట్టారు.
యూసీసీ బిల్లు మెజారిటీ వర్గాలకు వర్తించదా..? - అసదుద్దీన్ ఒవైసీ
కాగా.. యూసీసీకి ఆమోద ముద్ర వేయకముందు ఈ బిల్లుపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. అసెంబ్లీలో సీఎం ధామి మాట్లాడుతూ ఇది సాధారణ బిల్లు కాదన్నారు. భారతదేశం సువిశాల దేశమని, రాష్ట్రాలు గణనీయమైన పురోగతి సాధించడానికి, మొత్తం దేశాన్ని ప్రభావితం చేయగలదని అన్నారు. చరిత్ర సృష్టించి, యావత్ దేశానికి మార్గదర్శకంగా నిలిచే అవకాశం ఉత్తరాఖండ్ కు దక్కిందని తెలిపారు. రాజ్యాంగ నిర్మాతలు నిర్దేశించిన ఆకాంక్షలు, ఆదర్శాలను నెరవేర్చే దిశగా దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలు కూడా ఇదే బాటలో పయనించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ఖర్గే రాజ్యసభలో ప్రసంగం చూసి నాకు ఆశ్చర్యమేసింది - ప్రధాని నరేంద్ర మోడీ..
బిల్లు ఆమోదం పొందిన తర్వాత ఉత్తరాఖండ్ ప్రజలకు, ప్రధాని మోడీకి ముఖ్యమంత్రి ధామి కృతజ్ఞతలు తెలిపారు. ఇదొక ప్రత్యేకమైన రోజు అని అన్నారు. వివాహం, జీవనోపాధి, వారసత్వం, విడాకులు వంటి విషయాల్లో ఎలాంటి పక్షపాతం లేకుండా అందరికీ సమానత్వాన్ని కల్పిస్తుందని నొక్కిచెప్పారు. ఈ బిల్లు ప్రధానంగా మహిళలపై వివక్షను పరిష్కరిస్తుందని, వారిపై జరుగుతున్న అన్యాయాలు, తప్పుడు చర్యలను నిర్మూలించడంలో కీలక ముందడుగుగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. 'మాతృశక్తి'పై జరుగుతున్న దౌర్జన్యాలను ఆపాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అక్కాచెల్లెళ్లపై వివక్ష ఆపాలని, జనాభాలో సగం మందికి సమాన హక్కులు రావాలని సీఎం అన్నారు.
బిల్లులో కీలకాంశాలు..
- ఈ బిల్లులో వివాహం, విడాకులు, వారసత్వం, సహ జీవనం సంబంధిత విషయాలకు సంబంధించిన చట్టాలు ఉన్నాయి.
- సహ జీవనం చేసే జంటలు ఈ చట్టం కింద తప్పనసరిగా నెల రోజుల్లోపు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
- బాల్యవివాహాలను పూర్తిగా నిషేధించడంతో పాటు విడాకులకు ఏకరీతి విధానానికి ఈ బిల్లు దారి చూపిస్తుంది.
మంచి పనులు చేసే వ్యక్తికి గౌరవం దక్కదు - నితిన్ గడ్కరీ
- అన్ని మతాల మహిళలకు వారి పూర్వీకుల ఆస్తిలో సమాన హక్కులను కల్పిస్తుంది.
- అన్ని వర్గాల్లో మహిళలకు వివాహ వయస్సు 18 ఏళ్లు, పురుషులకు 21 ఏళ్లుగా ఉంటుంది.
- అన్ని మతాల్లో వివాహ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. రిజిస్ట్రేషన్ కాని వివాహాలు చెల్లవు.