Asianet News TeluguAsianet News Telugu

రైతు ప్రతీకారం.. రెండు పులులు బలి..

ఓ రైతు ప్రతికారాన్ని తీర్చుకున్నాడు. తన ఆవు చనిపోవడానికి కారణమైన పులులను చంపాలని భావించారు. తన ఆవు కళేబరంపై విషాన్ని పూసి ఎరగా వేశాడు. ఆ విష కళేబరాన్ని తిన్న ఆ పులులు మృత్యువాత పడ్డాయి. అలా తన ప్రతికారాన్ని తీర్చుకున్నాడు.  ఈ ఘటన తమిళనాడు లోని నీలగిరి  జిల్లాలోని చోటుచేసుకుంది. 

Tamil Nadu farmer arrested for poisoning, killing two tigers KRJ
Author
First Published Sep 13, 2023, 7:35 AM IST

ఓ రైతు తన ప్రతికారాన్ని తీర్చుకున్నాడు. తనకు ఎంతో ఇష్టమైన ఆవు చనిపోవడంతో చలించిపోయాడు. తన ఆవును పులి చంపిందని భావించి.. ఆ ఆవు కళేబరంపై విషాన్ని పూసి ఎరగా వేశాడు. ఆ విష కళేబరాన్ని తిన్న ఆ పులులు మృత్యువాత పడ్డాయి. అలా తన ప్రతికారాన్ని తీర్చుకున్నాడు. అయితే.. అనుమానాస్పద స్థితిలో ఆ పులులు చనిపోవడాన్ని గుర్తించిన అటవీ అధికారులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. వారి దర్యాప్తులో అసలు వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన తమిళనాడు లోని నీలగిరి  జిల్లాలోని చోటుచేసుకుంది. 

వివరాల్లోకెళ్తే శేఖర్ అనే రైతుకు చెందిన ఆవు గత పది రోజుల క్రితం మేతకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఆ రైతు తన ఆవు కోసం వెతుకులాట ప్రారంభించారు. ఈ క్రమంలో అతడు  ఊహించని పరిణామం  ఎదుర్కొన్నాడు. సమీపంలోని అడవి ప్రాంతంలో తన ఆవు కళేబరాన్ని గుర్తించారు. ఆ ఆవు చనిపోయిన స్థితిని చూసి చలించిపోయాడు. ఆవుపై తీవ్రమైన గాయాలు ఉండడంతో పులి చనిపోయిందని నిర్ధారణకు వచ్చాడు. దీంతో ఎలాగైనా తన ఆవును చంపిన పులిని చంపి ప్రతీకారం తీర్చుకోవాలని భావించాడు. ఈ మేరకు చనిపోయిన తన ఆవు కళేబరానే ఎరగా వాడుకున్నాడు.  ఆ ఆవు కళేబరంపై పురుగుల మందు పూశాడు. ఈ క్రమంలో ఆ విషపూరితమైన కళేబరాన్ని తిన్న..  రెండు పులులు మృత్యువాత పడ్డాయి.

శనివారం నాడు రెండు పులులు అనుమానస్పద స్థితిలో చనిపోయినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలో ఆ ఆవు కళేబరాన్ని, పులుల సాంపిల్స్ ను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపగా.. విషపూరితమైన ఆవు కళేబరాన్ని తినడం వల్లే.. రెండు పులులు చనిపోయినట్లు తేలింది. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టి దీనికి కారణమైన ఆవు యజమానిని అదుపులోకి తీసుకున్నారు. ఆ రైతును విచారించగా.. తన ఆవును చంపేశాయనే.. తాను విషం పెట్టి పులులను చంపేసినట్లు ఆ రైతు అంగీకరించాడు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios