' బీజేపీ కార్యాలయంలో గొడ్డు మాంసం వడ్డించాలి': కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు 

Tamil Nadu: 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో తమిళనాడులో కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒడిశాలో ఎన్నికల ప్రచారంలో తమిళులను కించపరిచేలా చేసిన వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ ఆరోపిస్తుంది.  ఈ తరుణంలో బిజెపి కార్యాలయంలో గొడ్డు మాంసం వడ్డించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేయడం చర్చనీయంగా మారింది. 

Tamil Nadu Congress leader EVKS Elangovan said we go there, we need non-veg food. So we need non-veg food and beef KRJ

Tamil Nadu: 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో తమిళనాడులో కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒడిశాలో ఎన్నికల ప్రచారంలో తమిళులను కించపరిచేలా చేసిన వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఈ  విషయంపై వారం రోజుల్లోగా ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా క్షమాపణలు చెప్పకపోతే చెన్నైలోని బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడిస్తామని కాంగ్రెస్ పార్టీ బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. 

ఈ ప్రకటనపై తమిళనాడు బిజెపి అధ్యక్షుడు అన్నామలై స్పందించారు. నిరసనకారులకు ఆహారం అందించడానికి తాము సిద్దంగా ఉన్నామనీ, ఎంతమంది వస్తారో కాంగ్రెస్ ముందుగానే వారికి తెలియజేయాలని సూచించాలని తనదైన శైలితో స్పందించారు. 

ఈ ప్రకటనతో ఈ వివాదం మరింత పెరిగింది. ఆహార ప్రాధాన్యతలపై ముఖ్యంగా గొడ్డు మాంసం డిమాండ్‌పై చర్చగా మారింది. తమిళనాడు కాంగ్రెస్ నాయకుడు ఈవీకేఎస్ ఎలంగోవన్ గురువారం నాడు స్పందిస్తూ.. "మేము అక్కడికి వెళితే, మాకు నాన్-వెజ్ ఫుడ్ కావాలి, మాకు గొడ్డు మాంసం ఇష్టం. కాబట్టి మాకు నాన్ వెజ్ ఫుడ్ కావాలి. గొడ్డు మాంసం సిద్ధం చేయడానికి మేము వారికి రెండు రోజుల సమయం ఇస్తాము. అని ట్వీట్ చేశారు. తమకు గొడ్డు మాంసం వడ్డించాలని డిమాండ్ తాజా వివాదానికి దారితీసింది. ఈ అంశంపై సోషల్ మీడియాలో అటు బీజేపీపై.. ఇటు కాంగ్రెస్ పై కామెంట్ల వర్షం కురుస్తుంది.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios