Asianet News TeluguAsianet News Telugu

కాన్వాయ్ ఆపి, కారు దిగి జనాలకు మాస్క్ తొడిగిన తమిళనాడు సీఎం స్టాలిన్

తమిళనాడు సీఎం స్టాలిన్ స్వయంగా ప్రజలకు మాస్కులు తొడిగారు. చైన్నై పట్టణంలో ప్రజలు మాస్కులు లేకుండా ఉండటం చూసిన ఆయన.. కారు దిగి వారికి మాస్కులు అందజేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

Tamil Nadu CM Stalin stops the convoy, gets out of the car and puts a mask on the crowd
Author
Tamil Nadu, First Published Jan 4, 2022, 8:26 PM IST

ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా విళ‌య‌తాండ‌వం చేస్తోంది. ఇప్పుడిప్పుడే క‌రోనా త‌గ్గుముఖం ప‌డుతోందని అనుకుంటున్న స‌మ‌యంలో మ‌ళ్లీ కేసులు పెరుగుతున్నాయి. ఇండియాలో కూడా క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. ఇటీవ‌లి వ‌ర‌కు 10 వేల పైన మాత్ర‌మే కేసులు న‌మోద‌వుతున్న‌ప్ప‌టీకీ ఆ సంఖ్య నిన్న మొన్న బాగా పెరిగింది. ఈరోజు ఏకంగా ముప్పై వేల‌కు పైగా కేసులు న‌మోద‌య్యాయి. అలాగే ఒమిక్రాన్ వేరియింట్ కేసులు కూడా అధికంగానే న‌మోద‌వుతున్నాయి. ద‌క్షిణాఫ్రికాలో వెలుగులోకి వ‌చ్చిన ఈ వేరియంట్ ఇప్పుడు 38 దేశాల‌కు విస్త‌రించింది. మ‌న దేశంలో ఈ వేరియంట్ గ‌త నెల 2వ తేదీన వెలుగులోకి వ‌చ్చింది. క‌ర్నాట‌క‌లోని బెంగ‌ళూరులో మొట్ట‌మొద‌ట‌గా రెండు కేసుల‌ను ఆరోజే గుర్తించారు. ఈ కేసులు కూడా ఇప్ప‌టి వ‌ర‌కు 1500 దాటాయి. దీంతో ప్ర‌జ‌ల్లో ఆందోళ‌న‌లు ఎక్కువ‌వుతున్నాయి. 

క‌రోనా సోకినా.. ఆక్సిజన్ అవ‌స‌రమ‌య్యేవారు త‌క్కువే..!

స్వ‌యంగా మాస్కులు తొడిగిన సీఎం ఎం.కే స్టాలిన్‌
ఓ వైపు దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నా.. ప్ర‌జ‌ల్లో నిర్ల‌క్ష్యం మాత్రం త‌గ్గ‌డం లేదు. క‌రోనా నిబంధ‌న‌లు పాటించాల‌ని, ప్ర‌తీ ఒక్క‌రూ మాస్క్ ధ‌రించాల‌ని, భౌతిక‌దూరం పాటించాల‌ని కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు హెచ్చ‌రిస్తున్నా.. చాలా మంది వాటిని ప‌ట్టించుకోవ‌డం లేదు. ప్ర‌జ‌లు ఇలా నిర్ల‌క్ష్యం పాటించ‌డం వ‌ల్ల కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నాయి. త‌మిళ‌నాడు రాష్ట్రంలో కూడా ప్ర‌జ‌లు ఇలాగే నిర్ల‌క్షం వ‌హించ‌డం వ‌ల్ల డైరెక్ట్ గా సీఎం రంగంలోకి దిగారు. చైన్నై ప‌ట్ట‌ణంలో వీధుల్లో మాస్కు లేకుండా తిరుగుతున్న వారిని చూసి అలాగే ఉండ‌లేక‌పోయారు. క‌దులుతున్న కాన్వాయ్‌ని ఆపి, కారు దిగి ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్లారు. మాస్కులు లేని వారికి త‌న చేతుల‌తో స్వ‌యంగా మాస్కులు తొడిగారు. అంతటితో ఆగ‌కుండా ఆ ప్రాంతం అంతా తిరుగుతూ అంద‌రికీ మాస్కులు పంపిణీ చేశారు. 

భారత్‌లో కరోనా Third Wave.. బీ అలర్ట్.. కోవిడ్‌ వర్కింగ్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ ఎన్‌కే ఆరోరా

చైన్నై వీధుల్లో న‌డుస్తూ ప్ర‌జ‌లకు మాస్కు ప‌ట్ల అవ‌గాహ‌న క‌ల్పించారు. అంద‌రూ క‌రోనా నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచించారు. త‌న ఆఫీసు నుంచి ఇంటికి వెళ్లే స‌మ‌యంలో ఇది చోటు చేసుకుంది. ఎప్పుడూ కాన్వాయ్‌లో స్పీడ్ గా వెళ్లే సీఎం.. ఇలా త‌మ మ‌ధ్య‌లోకి వ‌చ్చి న‌డుస్తూ మాస్కులు పంపిణీ చేయ‌డం ప‌ల్ల అక్క‌డున్న జ‌నాలు ఒక్క సారికి షాక్ కు గుర‌య్యారు. అనుకోకుండా జ‌రిగిన ఈ ప‌రిణామాన్ని అక్క‌డున్న వారంతా వీడియోల్లో బంధించారు. ఇలా చెన్నై వీధుల్లో న‌డ‌స్తూ మాస్కులు పంపిణీ చేసిన వీడియోను సీఎం స్టాలిన్ త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. ప్ర‌జ‌లంద‌రూ మాస్కులు ధ‌రించాల‌ని సూచించారు. అంద‌రూ త‌ప్ప‌కుండా కరోనా నిబంధ‌ల‌ను పాటించాల‌ని కోరారు. ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. సీఎం ఇంత  సింపుల్ గా ఉంటారా ?  సీఎం అంటే స్టాలిన్ లా ఉండాలంటూ కామెంట్లు పెడుతున్నారు. క‌రోనా ఎంత పెరుగుతున్నా ప్ర‌జ‌లు ఇంకా నిర్ల‌క్ష్యం వీడ‌టం లేద‌ని అంటున్నారు. ఇప్ప‌టికైనా ప్ర‌జ‌లంద‌రూ బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించాల‌ని, క‌రోనా క‌ట్ట‌డి ఏ ఒక్క‌రి చేతుల్లో లేద‌ని, అంద‌రూ క‌లిసిక‌ట్టుగా నిబంధ‌న‌లు పాటిస్తేనే కోవిడ్ కంట్రోల్ అవుతుంద‌ని కామెంట్లు చేస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios