మణిపూర్ క్రీడాకారులకు అండగా తమిళనాడు ప్రభుత్వం.. సీఎం స్టాలిన్ సంచలన నిర్ణయం..!!
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆదివారం కీలక ప్రకటన చేశారు. రెండు నెలలకు పైగా మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని క్రీడాకారులను తమిళనాడు రాష్ట్రంలో శిక్షణ కోసం ఆహ్వానించారు.

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆదివారం కీలక ప్రకటన చేశారు. రెండు నెలలకు పైగా మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని క్రీడాకారులను తమిళనాడు రాష్ట్రంలో శిక్షణ కోసం ఆహ్వానించారు. ఈ విషయంలో వారికి రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి ఉదయనిధి అన్ని సౌకర్యాలు కల్పిస్తారని హామీ ఇచ్చారు. మణిపూర్‌లోని క్రీడాకారులు ఖేలో ఇండియా, ఆసియా క్రీడల వంటి ఈవెంట్‌లలో శిక్షణ పొందేందుకు అక్కడి పరిస్థితి అనుకూలంగా లేదని సీఎం స్టాలిన్ ఒక ప్రకటనలో తెలిపారు.
తమిళనాడులోని మణిపూర్ క్రీడాకారులకు ఏర్పాట్లు చేయాలని యువజన సంక్షేమం, క్రీడల అభివృద్ధి శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ను ఆదేశించినట్లు ఆయన చెప్పారు. రాష్ట్ర క్రీడా విభాగం తరపున "అధిక-నాణ్యత" సౌకర్యాలు కల్పిస్తామని ఉదయనిధి హామీ ఇచ్చారు. ఇక, ఖేలో ఇండియా గేమ్స్- 2024 ఎడిషన్‌కు తమిళనాడు ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే.
మణిపూర్ ఛాంపియన్‌లను, ముఖ్యంగా మహిళా ఛాంపియన్‌లను ఉత్పత్తి చేయడానికి ప్రసిద్ధి చెందిందని స్టాలిన్ పేర్కొన్నారు. అయితే అక్కడి ప్రస్తుత పరిస్థితులను తమిళనాడు తీవ్రమైన ఆందోళన, వేదనతో చూస్తోందని అన్నారు. తమిళ సంస్కృతి ప్రేమ, సంరక్షణతో జీవిస్తోందని.. “యాతుం ఊరే, యావరుం కేళిర్” అంటే “ప్రతి ప్రదేశమూ నాదే, ప్రజలందరూ నా బంధువులే” అనే సూక్తిని స్టాలిన్ హైలైట్ చేశారు. తమిళనాడులో మణిపూర్ క్రీడాకారుల శిక్షణపై తన ఆదేశాలకు ఇది ఆధారం అని ఆయన తెలిపారు.
మణిపూర్ నుండి ఈ ప్రయోజనం పొందాలనుకునే వారు +91-8925903047ని సంప్రదించవచ్చు లేదా ID ప్రూఫ్, శిక్షణ అవసరాలతో సహా వివరాలను sportstn2023@gmail.comకు ఇమెయిల్ చేయవచ్చుని పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే, ఎంకే స్టాలిన్ ఆహ్వానంపై బీజేపీ నుంచి పదునైన ప్రతిస్పందన వచ్చింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె అన్నామలై స్పందిస్తూ.. స్టాలిన్ నిద్ర నుంచి మేల్కొన్నాడని, రాజకీయవేత్తలాగా వ్యవహరిస్తున్నారని నిందించారు. ఖేలో ఇండియా గేమ్‌లను ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వానికి.. టోర్నమెంట్ కోసం క్రీడాకారులకు ఎలా శిక్షణ ఇవ్వాలో కూడా తెలుసునని అన్నారు. మణిపూర్రలో ఏమి జరుగుతుందో స్టాలిన్‌కు తెలియదని ఆరోపించారు. పుత్తుకోట్టైలోని వెంగైవాయల్‌లోని దళిత నివాసితులకు అందించే ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంక్‌లో మానవ మలం కనిపించిన సంఘటనను అన్నామలై ప్రస్తావిస్తూ.. ఈ సంఘటన జరిగి 200 రోజులు గడిచిపోయినప్పటికీ నేరస్థుల గురించి ఎటువంటి పురోగతి లేదని అన్నారు.
మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో వైరల్ కావడంతో ఆరుగురిని అరెస్టు చేసినట్లు ఆరుగురిని అరెస్టు చేశారని.. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరిస్తాయని అన్నామలై అన్నారు. ఈ సంఘటనను బాధితులకు తీవ్ర అన్యాయం జరిగిందని.. మణిపూర్ ప్రభుత్వం ఈ విషయంపై చర్య తీసుకుందని, దోషులకు ఉరిశిక్షను నిర్ధారించే ప్రయత్నాలను ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ వాగ్దానం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. మణిపూర్ చాలా కాలంగా సమస్యలను ఎదుర్కొంటోందని, 2014 తర్వాత బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాతే శాంతి నెలకొందని అన్నారు. మంత్రివర్గంలో ఉన్న ఆయన కుమారుడు ఉదయనిధిని 'ప్రమోట్' చేయడానికి స్టాలిన్ నిరంతరం క్రీడల గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. స్టాలిన్ కావేరి దృష్టిపెట్టాలని.. కర్ణాటక నుండి రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాను పొందేలా చూడాలని డిమాండ్ చేశారు.