కొడుకు ఎవరైనా అమ్మాయిని ప్రేమించాను అని చెప్పగానే సంతోషంగా పెళ్లి చేసే కొడుకులు ఉన్నారు. లేందంటే వాళ్ల ప్రేమను అంగీకరించకుండా పెళ్లికి ఒప్పుకోని తండ్రులు కూడా ఉంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం కొడుకు ప్రేమించిన అమ్మాయిపై కన్నేశాడు. కొడుకు ప్రేమను అంగీకరించకగా పోగా.. సదరు  యువతిపై అత్యాచారం చేశాడు. ఈ దారుణ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... తమిళనాడులోని నాగప్నటం జిల్లాకు చెందిన నిత్యానందం ఓ బిజినెస్ మేన్. అతనికి ముకేష్ కన్నన్ అనే కుమారుడు ఉన్నాడు. అతను కొంతకాలంగా ఓ యువతిని ప్రేమించాడు. ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. ఇదే విషయం ఇరువైపులా పెద్దలకు తెలియజేశారు.

ఇరువైపుల పెద్దలు వారి పెళ్లిని అంగీకరించలేదు. దీంతో... ఆమెను పెళ్లి చేసుకోకపోతే తాను బతకనంటూ కొడుకు తండ్రిని ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేశాడు. దీంతో కొడుకును ఆ యువతి నుంచి ఎలాగైనా దూరం చేయాలని నిత్యానందం ప్లాన్ వేశాడు.

Also Read పిల్లల్ని బంధించిన నేరస్తుడు: కాల్చి చంపిన కమెండోలు...

ఒక రోజు  సదరు యువతి ఇంటికి వెళ్లాడు. తన కొడుకుతో పెళ్లి చేస్తానని యువతిని నమ్మించాడు. తన వెంట కారులో తీసుకువెళ్లి.. మార్గమధ్యంలో అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం బలవంతంగా ఆమె మెడలో తాళికట్టాడు. తర్వాత తన స్నేహితుడి ఇంట్లో యువతిని నిర్భందించాడు. ఇక నుంచి తనతోనే కాపురం చేయాలని లేదంటే చంపేస్తానని బెదిరించాడు.

మరోవైపు ఆ అమ్మాయి నిన్ను మోసం చేసి మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంటోందంటూ సినీ ఫక్కీలో కొడుకును నమ్మించాడు.  ఆ యువకుడు కూడా తండ్రి చెప్పింది నిజమనుకున్నాడు. కాగా.... నిర్భందంలో ఉన్న యువతి తప్పించుకొని వచ్చి పోలీసులకు ఫిర్యాదు  చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.