Asianet News TeluguAsianet News Telugu

తమిళం కూడా ఒక ‘జాతీయ భాష’ - కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌

తమిళ భాష గొప్పదని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కొనియాడారు. తమిళం కూడా ఒక జాతీయ భాషనే అని అన్నారు. నూతన జాతీయ విద్యా విధానం ప్రాంతీయ భాషల్లో విద్యను ప్రోత్సహిస్తోందని తెలిపారు. 

Tamil is also a 'national language' - Union Education Minister Dharmendra Pradhan
Author
First Published Sep 20, 2022, 4:06 PM IST

తమిళం కూడా ఒక జాతీయ భాష అని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. తమిళనాడులోని సాస్ట్రా డీమ్డ్ యూనివర్సిటీ లో మంగ‌ళ‌వారం నిర్వహించిన 36వ స్నాతకోత్సవానికి ఆయ‌న హాజ‌రై మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా తమిళ భాష ప్రాముఖ్య‌త‌ను నొక్కి చెప్పారు. నూత‌న జాతీయ విద్యా విధానం ప్రాంతీయ భాష‌ల‌ను ఎలా ప్రోత్సహిస్తుందో వివ‌రించారు.

పంజాబ్ సీఎం లిక్కర్ తాగి ఫ్లైట్ ఎక్కాడా? దర్యాప్తు చేస్తాం: కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా

జాతీయ విద్యా విధానం భారతీయతలో పాతుకుపోయిందని, మాతృభాషలో అభ్యసనానికి ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. కొత్త విద్యా విధానం ఆయా రాష్ట్రాల మాతృభాషలో విద్యాభ్యాసం జరిగేలా చూస్తుందని ఆయన అన్నారు.

ఆవును అసెంబ్లీకి తీసుకొచ్చిన రాజ‌స్థాన్ బీజేపీ ఎమ్మెల్యే.. ఎందుకంటే ?

NEP - 2020 రాకతో విద్యార్థులకు మాతృభాషలలో విద్య అందించడం ద్వారా వారికి మరింత సులభంగా అర్థం అవుతుందని అన్నారు. దీని వల్ల రానున్న కాలంలో విద్యార్థులు మరింత మెరుగ్గా తమ చదువులో రాణిస్తారని, దీంతో ఉద్యోగావ‌కాశాలు కూడా పెరుగుతాయ‌ని అన్నారు.

‘‘ మేము NEP గురించి మాట్లాడుతున్నప్పుడు, తమిళం జాతీయ భాష. విద్య మాతృభాషలో ఉండాలి. నాకు ఎవరి నుంచి కూడా సరైన వ్యతిరేకత కనిపించడం లేదు. అయితే ఈరోజుకి కూడా  కొంతమంది స్నేహితులు ఈ విష‌యం ప‌ట్ల అనుకూలంగా లేరు. క్రమంగా వారు కూడా మ‌ద్ద‌తు ఇస్తారు. ’’ అని ఆయన అన్నారు. 

కేంద్రమంత్రి నారాయణ్ రాణేకు హైకోర్టు షాక్.. ఆయన ఇంటిలోని అక్రమ నిర్మాణాన్ని కూల్చేయండి.. రూ. 10 లక్షల ఫైన్

విద్య విషయంలో తమిళనాడుకు గొప్ప వారసత్వం ఉందని, రాష్ట్రం జ్ఞానానికి నిలయంగా కొనసాగుతుందని తెలిపారు. ‘‘ విద్యలో తమిళనాడుకు గొప్ప వారసత్వం ఉంది. ఎన్ఈపీ ఫ్రేమ్ వర్క్ లో తమిళనాడు ఎప్పటిలాగే ముందంజలో కొనసాగుతుంది ’’ అని ఆయ‌న ఆశాభావం వ్య‌క్తం చేశారు. కాగా.. ప్ర‌స్తుతం కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ త‌మిళ‌నాడు ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios