భారత్ నిర్వహిస్తున్న కార్యక్రమంలో తాలిబాన్లు పార్టిసిపేట్ చేయడానికి ఓ లేఖ రాశారు. కేంద్ర విదేశాంగ శాఖ పరిధిలో ఓ ఆన్‌లైన్ కోర్సు నిర్వహిస్తున్నారు. ఇందులో 160కిపైగా దేశాల నుంచి ఎన్‌రోల్‌మెంట్లు చేసుకున్నారు. ఇందులో ఆఫ్గనిస్తాన్ కూడా చేరడం ఆశ్చర్యకరంగా మారింది.
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న ఓ కార్యక్రమంలో తాలిబాన్లు పాల్గొనబోతున్నారు. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించబోతున్న ఓ ఆన్‌లైన్ కోర్సులో పాల్గొంటామని తాలిబాన్లు లేఖ పంపారు. ఈ కోర్సును కోళికోడ్ ఐఐఎం నిర్వహిస్తుంది. ఇండియన్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ (ఐటీఈసీ)లో భాగంగా ఈ ఆన్‌లైన్ కోర్సును కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ కింద కాండక్ట్ చేయబోతున్నారు. ఆఫ్గనిస్తాన్ సహా విదేశాలు ఈ ఆన్‌లైన్ ప్రోగ్రామ్‌లో పాల్గొనవచ్చు.
యాన్ ఇండియన్ ఇమ్మర్షన్ ప్రోగ్రామ్‌ను మార్చి 14వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో నిర్వహించబోతున్నట్టు ఐటీఈసీ వెబ్ సైట్ తెలిపింది. భారత్‌లో వ్యాపార వాతావరణం, సాంస్కృతిక వారసత్వం, రెగ్యులేటరీ ఇకోసిస్టమ్‌లపై లోతైన అవగాహన ఈ ఆన్‌లైన్ కోర్సు కల్పిస్తుంది.
కేంద్ర విదేశాంగ శాఖ పరిధిలో పని చేసే ఐటీఈసీ నిర్వహించే ఈ ప్రోగ్రామ్‌లో పార్టిసిపేట్ చేయడానికి 160కి పైగా దేశాల నుంచి సుమారు 2 లక్షల అధికారులు ఎన్‌రోల్‌మెంట్ చేసుకున్నారు.
అఫ్గనిస్తాన్ విదేశాంగ శాఖ పరిధిలో పని చేసే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిప్లమసీ లెటర్ హెడ్‌తో ఓ లేఖ బయటకు వచ్చింది. ఐటీఈసీ ప్రోగ్రామ్‌లో పాల్గొనడానికి విజ్ఞప్తితో ఆ లేఖ ఉన్నది.
ఈ ప్రోగ్రామ్‌లో చాలా దేశాలు పాల్గొంటున్నాయి. కానీ, తాలిబాన్ల నిర్ణయం మాత్రం సర్‌ప్రైజ్‌గా ఉన్నది. ఎందుకంటే తాలిబాన్ ప్రభుత్వాన్ని భారత్ ఇంకా గుర్తించలేదు. అయితే, సంక్షోభంలో ఉన్న అఫ్గనిస్తాన్‌కు మాత్రం భారత్ సహాయం అందిస్తున్నది.
