Asianet News TeluguAsianet News Telugu

పెరగనున్న టేక్ హోమ్ సాలరీ, 10 శాతానికి కుదించిన పీఎఫ్ వల్ల ఉద్యోగికి లాభమెంతంటే...

ఉద్యోగులు చెల్లించాల్సిన పీఎఫ్ ను రెండు శాతం మేర మూడు నెలలపాటు తగ్గిస్తున్నట్టు కేంద్రం తెలిపింది. దీని ద్వారా ఉద్యోగులకు చేతికందే జీతం మరింతగా పెరుగుతుందని కేంద్రం ప్రకటించింది. 

Take home salary to increase, govt notifies cut in EPF contribution to 10%
Author
New Delhi, First Published May 19, 2020, 11:31 AM IST

కరోనా వల్ల విధించిన లాక్ డౌన్ దెబ్బకు కుదేలైన ఆర్ధిక వ్యవస్థకు ఊతమివ్వడానికి ఆత్మనిర్భర్ భారత్ పేరిట ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 20 లక్షలకోట్ల ఆర్ధిక ప్యాకేజీని ప్రకటించారు. 

ఇందులో భాగంగా ఉద్యోగులు చెల్లించాల్సిన పీఎఫ్ ను రెండు శాతం మేర మూడు నెలలపాటు తగ్గిస్తున్నట్టు కేంద్రం తెలిపింది. దీని ద్వారా ఉద్యోగులకు చేతికందే జీతం మరింతగా పెరుగుతుందని కేంద్రం ప్రకటించింది. 

కేంద్రం నుండి ఈ ప్రకటన వెలువడ్డప్పటినుండి సాధారణ ఉద్యోగుల్లో చాలా మందికి తమ జీతంలో ఎంతమేర ఎక్కువ వస్తుంది? అని ఒక ప్రశ్న మెదులుతూ ఉంది. దీనికి సమాధానం కావాలంటే... ముందు పీఎఫ్ గురించి తెలుసుకోవాలి. 

ధారణంగా మనం ఈ పీఎఫ్ ను భవిష్యనిధి అని అంటాము. ప్రతి నెల కూడా ఉద్యోగి జీతం నుంచి 12 శాతం, కంపెనీ నుంచి మరో 12 శాతం ఆ ఉద్యోగి భవిష్య నిధి అకౌంట్ లో జమ చేస్తారు. 

అయితే తాజా ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా కంపెనీ 12 శాతం యథాతథంగా కడుతుంది. ఉద్యోగి మాత్రం కేవలం 10 శాతం మాత్రమే చెల్లిస్తాడు. తన మొత్తం జీతం లో ఒక రెండు శాతం మరో మూడు నెలలపాటు ఉద్యోగి చేతికి అదనంగా వస్తుందన్నమాట. 

అంటే... ఒక ఉద్యోగి జీతం 1000 రూపాయలనుకుంటే.... ఇంతకుముంది 120 రూపాయలు చెల్లించేవాడు, ఇకమీదట 100 రూపాయలు ఇస్తే సరిపోతుంది. 20 రూపాయలు ఆదా అవుతాయన్నమాట!

ప్రభుత్వ  సంస్థలు అది కేంద్రమైనా రాష్ట్రమైనా అందులో పనిచేసే ఉద్యోగులకు మాత్రం ఈ మినహాయింపు ఉండదు. అలానే ప్రభుత్వమే మొత్తం 24 శాతం చెల్లించేవాటిలో కూడా ఈ మినహాయింపు వర్తించదు. 

ఈ కరోనా వల్ల విధించిన లాక్ డౌన్ వల్ల ప్రజల చేతుల్లో మరింత డబ్బును ఉంచేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనిద్వారా ఉద్యోగస్తుల టేక్ హోమ్ సాలరీలో మాత్రం ఈ మూడు నెలలు మే, జూన్, జులై లలో కొంత ఎక్కువ రాబోతుందనడంలో ఎటువంటి సందేహం లేదు!

Follow Us:
Download App:
  • android
  • ios