స్విగ్గీ బంపర్ ఆఫర్.. అన్ లిమిటెడ్ ఫ్రీ ఫుడ్ డెలివరీ

First Published 31, Jul 2018, 1:05 PM IST
Swiggy launches membership programme with unlimited free deliveries
Highlights

అన్ లిమిటెడ్ గా ఉచితంగా ఫుడ్ ని డెలివరీ చేస్తామని స్విగ్గీ ప్రకటించింది. ఇతర ఫుడ్ యాప్స్ జొమాటో, ఉబర్ ఈట్స్ నుంచి పోటీ బాగా పెరగడంతో.. ఆ పోటీని తట్టుకునేందుకు  స్విగ్గీ ఈ బంపర్ ఆఫర్ ని ప్రవేశపెట్టింది.

ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ.. వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. అన్ లిమిటెడ్ గా ఉచితంగా ఫుడ్ ని డెలివరీ చేస్తామని స్విగ్గీ ప్రకటించింది. ఇతర ఫుడ్ యాప్స్ జొమాటో, ఉబర్ ఈట్స్ నుంచి పోటీ బాగా పెరగడంతో.. ఆ పోటీని తట్టుకునేందుకు  స్విగ్గీ ఈ బంపర్ ఆఫర్ ని ప్రవేశపెట్టింది.

ఆర్డర్ చేసినవారందరికీ ఫ్రీగా ఇచ్చేస్తే స్విగ్గీకి వచ్చే లాభం ఏమిటి..? ఇదేగా మీ అనుమానం. ఇక్కడే ఓ లిటికేషన్ ఉంది. మీకు నచ్చిన రెస్టారెంట్ నుంచి నచ్చిన ఫుడ్ ని ఉచితంగా పొందాలంటే.. ముందుగా మీరు స్విగ్గీ మెంబర్ షిప్ తీసుకోవాల్సి ఉంటుంది. కస్టమర్లు స్విగ్గీలో మెంబర్‌షిప్ తీసుకుంటే దాంతో వారికి ఉచితంగా ఫుడ్ డెలివరీలు లభిస్తాయి. 3 నెలల కాలానికి గాను స్విగ్గీ మెంబర్‌షిప్‌ను అందించాలని చూస్తున్నది.

 ఈ మెంబర్‌షిప్ రుసుము నెలకి  రూ.99 నుంచి రూ.149 మధ్య ఉంటుందని తెలిసింది. ఇందులో 2 లక్షల మంది కస్టమర్లను చేర్చుకోవాలని స్విగ్గీ ఆలోచిస్తున్నది. ఇప్పటికే 7 పట్టణాల్లో పరిమిత సంఖ్యలో పలువురు కస్టమర్లకు స్విగ్గీ మెంబర్‌షిప్‌ను అందిస్తున్నది. ప్రస్తుతం ఈ మెంబర్‌షిప్ ఆఫర్ ప్రయోగాత్మక దశలో ఉంది కానీ అతి త్వరలోనే కస్టమర్లకు అందుబాటులోకి రావచ్చని తెలిసింది.

అంతేకాదు.. పర్టిక్కులర్ గా రోజులో కొన్ని గంటలు మాత్రమే ఈ ఆఫర్ వర్తించేలా పెట్టాలని స్విగ్గీ భావిస్తోంది. మిగిలిన టైంలో మెంబర్ షిప్ తీసుకున్నవారికి స్పెషల్ డిస్కౌంట్లు ఇచ్చే అవకాశం ఉంది. మరికొద్ది రోజుల్లో స్విగ్గీ ఈ ఆఫర్ ని అమలులోకి తీసుకురానుంది. 

loader