Swiggy Instamart: వింత రిజిగ్నేషన్ లెటర్.. చూస్తే నవ్వాపుకోవడం కష్టమే.. !
Swiggy Instamart: సోషల్ మీడియా వేదికగా Swiggy Instamart షేర్ చేసిన ఒక రిజైన్ లెటర్ వైరల్ అవుతోంది. ట్విట్టర్‌లో షేర్ చేసిన ఈ పోస్టులో ఇన్‌స్టామార్ట్‌లో లభ్యమయ్యే అన్ని స్నాక్ ఐటమ్స్‌ను ఉపయోగించి ఆ సంస్థ రిజిగ్నేషన్ లెటర్ తయారు చేసింది. ఇది ఇప్పుడు నవ్వులు పూయిస్తోంది. నెటిజన్ల నుంచి తెగ లైక్ లు, కామెంట్స్ వస్తున్నాయి.

Swiggy Instamart-resignation letter: సోషల్ మీడియా వేదికగా Swiggy Instamart షేర్ చేసిన ఒక రిజైన్ లెటర్ వైరల్ అవుతోంది. ట్విట్టర్‌లో షేర్ అయిన ఈ పోస్టులో ఇన్‌స్టామార్ట్‌లో లభ్యమయ్యే అన్ని స్నాక్ ఐటమ్స్‌ను ఉపయోగించి ఆ సంస్థ రిజిగ్నేషన్ లెటర్ తయారు చేసింది. ఇది ఇప్పుడు నవ్వులు పూయిస్తోంది. నెటిజన్ల నుంచి తెగ లైక్ లు, కామెంట్స్ వస్తున్నాయి.
చాలా ప్రాంతాల్లో ఒత్తిడి భారంతో కూడిన పని సంస్కృతి కనిపించడం మాములే. అయితే, పనిప్రదేశంలో కూడా వినోదానికి పెద్దపీట వేస్తూ ఉపాధి పొందుతున్నారు. చేసే ప్రతిపనిలో వినోదం వికసించేలా ముందుకు సాగుతున్న ఎన్నో కథలు పలుమార్లు నెట్టింట వైరల్ అయ్యాయి. కానీ ఈ సారి మాత్రం ఇదే తరహాలో ఒక రాజీనామా లేఖ వైరల్ అవుతోంది. ఉద్యోగం చేయడంలోనే కాదు.. చివరికి ఉద్యోగానికి రాజీనామా చేసే విషయంలోనూ తగ్గేదే లేదంటూ దానికి కూడా వినోదాన్ని జోడిస్తున్నారు. తాజాగా Swiggy Instamart అత్యంత విచిత్రమైన రీతిలో రాజీనామా లేఖను రూపొందించి, దానిని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ట్విట్టర్‌లో షేర్ అయిన ఈ పోస్టులో ఇన్‌స్టామార్ట్‌లో లభ్యమయ్యే అన్ని స్నాక్ ఐటమ్స్‌ను ఉపయోగించి ఈ రాజీనామా లేఖను తయారు చేసింది. దీనిని చూసినవారెవరూ నవ్వకుండా ఉండలేరు. ప్రస్తుతం వైరల్ అవుతున్న పోస్టుపై విభిన్న కామెంట్లు వస్తున్నాయి. ఔరా రాజీనామా లేఖ కూడా ఇలా ఉంటుందా? అని కొంతమంది కామెంట్ చేయగా, మరికొంత మంది రాజీనామా లాంటి సీరియస్ విషయంలో ఇదేంటని ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా అయితే, నెటిజన్ల నుంచి పేద్ద సంఖ్యలో లైక్స్, షేర్ లతో ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.