Asianet News TeluguAsianet News Telugu

Swiggy-Zomato ల న‌యా రికార్డు.. నిమిషానికి Swiggyకి 9వేల ఆర్డర్లు.. Zomatoకి 7వేల ఆర్డర్లు..

న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా స్విగ్గీ (Swiggy), జొమాటో (Zomato)లు న‌యా రికార్డులు క్రియేట్ చేశాయి. జొమాటో నిమిషానికి 7,100 ఆర్డర్లు పూర్తి చేస్తే.. స్విగ్గీ నిమిషంలో 9వేల ఆర్డర్లను క్రాస్ చేసింది.  ఈ రెండు యాప్స్.. రోజులో 1.5 మిలియన్ల ఆర్డర్లను క్రాస్ చేశాయి. గతంలో 2021 కొత్త ఏడాది సందర్భంగా జొమాటో నిమిషానికి 4వేల ఆర్డర్లను క్రాస్ చేయగా.. స్విగ్గీ అదే సమయంలో 5వేల ఆర్డర్లను దాటేసింది. 
 

Swiggy clocks over 9,000 orders per minute, Zomato crosses 7,000 orders per minute on New Year's Eve
Author
Hyderabad, First Published Jan 1, 2022, 5:10 AM IST

Swiggy-Zomato Orders :  ఓమిక్రాన్  విజృంభిస్తున్న‌ నేప‌థ్యంలో చాలా మంది నూతన సంవత్సర వేడుక‌ల‌ను ఇంటి వ‌ద్ద‌నే జ‌రుపుకున్నారు. బ‌య‌ట కోవిడ్ ఆంక్షాలు అమ‌ల్లో ఉండ‌టంతో రెస్టారెంట్లకు వెళ్ల‌కుండా చాలామంది ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసి.. ఇంటికి తెప్పించుకుంటున్నారు. సరిగ్గా ఇదే సమయాన్ని ఫుడ్ డెలివరీ యాప్స్ వినియోగించుకుంటున్నాయి. ఈ క్ర‌మంలో భారతదేశంలో ప్రముఖ ఫుడ్ టెక్ ప్లాట్‌ఫారమ్స్ అయిన‌ స్విగ్గీ (Swiggy), జొమాటో (Zomato) విప‌రీత‌మైన డిమాండ్ పెరిగింది. 2022 న్యూ ఇయర్ సందర్భంగా స్విగ్గీ (Swiggy), జొమాటో (Zomato) ల‌కు అనూహ్య రీతిలో ఆర్డ‌ర్స్ వ‌చ్చాయి. దీంతో సరికొత్త రికార్డు క్రియేట్ చేశాయి. 2021లో మాదిరిగానే 2022 కొత్త ఏడాదిలో కూడా అదే జోరును సాగించాయి. గతంలో న‌మోదైన రికార్డువాటికి అవే బ్రేక్ చేశాయి.  

డిసెంబర్ 31, 2021, రాత్రి 8.20 గంటల సమయానికి నిమిషంలో ఈ రెండు యాప్స్ ఒక్కొక్కటిగా రికార్డు స్థాయిలో ఆర్డర్లను దాటేశాయి.  Zomatoకు  నిమిషానికి గరిష్టంగా 7,100 ఆర్డర్‌లు వ‌స్తే.. Swiggy కి నిమిషానికి 9,000 ఆర్డర్‌లను క్రాస్ చేసింది.  సాధారణంగా రెండు ప్లాట్‌ఫారమ్‌ల్లో రోజుకు 1.5 మిలియన్ ఆర్డర్‌లను అందుకుంటున్నాయి. గ‌తేడాది ఇదే న్యూ ఇయ‌ర్ వేడుక‌ల సంద‌ర్బంలో.. Zomato నిమిషానికి 4,000 ల‌ ఆర్డర్‌లు అందుకోగా..  , Swiggy నిమిషానికి 5,000 కంటే ఎక్కువ ఆర్డర్‌లను అందుకుంది. రెండు ప్లాట్‌ఫారమ్‌లు ఒక్కొక్కటి 2 మిలియన్లకు పైగా ఆర్డర్‌లను సాధించాయి, అవి సాధారణంగా ఒక రోజులో 1.3-1.5 మిలియన్ల ఆర్డర్‌లను అందుకుంటాయి.

read Also: Telanganaలో ఏరులై పారుతోన్న మద్యం.. రికార్డు స్థాయిలో liquor అమ్మ‌కాలు

ఆన్‌లైన్ ఆర్డర్‌లు వేగంగా నిర్వహించేందుకు UPI ద్వారా డిజిటల్ పేమెంట్ చేసుకోవచ్చు. అయితే చాలా మంది వినియోగదారులు పేమెంట్స్ చేసే సమయంలో ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయినట్టు చాలా ఫిర్యాదు చేశారు. దీనిపై జొమాటో వ్యవస్థాపకుడు CEO దీపిందర్ గోయల్ మాట్లాడుతూ.. UPI సక్సెస్ రేటు అన్ని యాప్‌లలో 70శాతం నుంచి 40శాతానికి బాగా తగ్గిందని తెలిపారు.

నిమిషానికి స్విగ్గి యొక్క ఆర్డర్‌లు దాని ఇన్‌స్టంట్ గ్రోసరీ సర్వీస్ ఇన్‌స్టామార్ట్‌ను మినహాయించాయి, ఇది నాచోస్, సోడాలు, ఐస్ ప్యాక్‌లు, నిమ్మకాయలు, పాప్‌కార్న్ మరియు కండోమ్‌లకు విపరీతమైన డిమాండ్‌ను చూసిన జొమాటో-బ్లిన్‌కిట్ వంటి భారీ ట్రాక్షన్‌ను కూడా చూసింది.

read Also: తెలుగు ప్రజలకు కేసీఆర్, చంద్రబాబు, పవన్ , బాలయ్య న్యూఇయర్ విషెస్

 ఇదిలా ఉండగా.. స్విగ్గీ, జొమాటో లాంటి యాప్స్‌లో ఆర్డర్ చేస్తే.. కొత్త ఏడాది (2022 జనవరి 1) నుంచి ఎక్స్ ట్రా చార్జీలు ప‌డ‌నున్నాయి. దీనికి ప్ర‌ధాన కార‌ణం..  స్విగ్గీ, జొమాటో యాప్స్ అన్నీ రెస్టారెంట్ల  మీద  2022 జనవరి 1 నుంచి ప్రభుత్వం GSTని వ‌సులూ చేయ‌నున్న‌ది. ఈ క్ర‌మంలో ఫుడ్ ఆర్డర్లపై 5శాతం పన్నును చెల్లించాల్సి ఉంటుంది.  
 

Follow Us:
Download App:
  • android
  • ios