Asianet News TeluguAsianet News Telugu

ట్విట్టర్ లో గోల్డెన్ టిక్... స్విగ్గీ రియాక్షన్ ఇదే..!

ఈ క్రమంలోనే.... ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీకి.... ట్విట్టర్ ఎకౌంట్ లో గోల్డెన్ టిక్ వచ్చింది. దానిపై ట్విట్టర్ రియాక్షన్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

Swiggy changes its Twitter bio after getting golden tick
Author
First Published Dec 14, 2022, 10:47 AM IST

ట్విట్టర్ ని టెస్లా అధినేత ఎలన్ మస్క్ సొంతం చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ఆయన ట్విట్టర్ ని తన హస్తగతం చేసుకున్న తర్వాత... దానిలో చాలా మార్పులు చేశాడు. ఈ క్రమంలో.... ట్విట్టర్ పై విమర్శలు కూడా ఎక్కువగానే వచ్చాయి. అంతేకాదు... గతంలో కేవలం.. ట్విట్టర్ లో బ్లూ టిక్ మాత్రమే కాదు.... చాలా రకాల టిక్స్ కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే.... ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీకి.... ట్విట్టర్ ఎకౌంట్ లో గోల్డెన్ టిక్ వచ్చింది. దానిపై ట్విట్టర్ రియాక్షన్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

 

పూర్తి వివరాల్లోకి వెళితే....  స్విగ్గీకి ట్విట్టర్ గోల్డెన్ టిక్ వచ్చింది. ఈ టిక్ రాగానే.. స్విగ్గీ.. ట్విట్టర్ లో తన బయోని మార్చేయడం విశేషం. ప్రముఖ పాపులర్ మూవీ.. మున్నాబాయ్ ఎంబీబీఎస్ సినిమాలోని ఓ ఫేమస్ డైలాగ్ ని తన బయోలో పెట్టుకోవడం గమనార్హం. ఆ సినిమాలో... ఓ ముసలి వ్యక్తితో జ్యూస్ తాగించడానికి హీరో.. క్యారమ్ ఆడిస్తాడు. ఆ సీన్ గుర్తుందా.. ఆ సమయంలో ఆ ముసలాయన చెప్పే ఓ డైలాగ్ ని తన బయోలో స్విగ్గీ పెట్టడం విశేషం. దానికి నెటిజన్ల రియాక్షన్ కూడా అదిరిపోయింది. 

ఈ సంగతి పక్కన పెడితే... ట్విట్టర్ "కంపెనీలకు గోల్డ్ టిక్, ప్రభుత్వానికి బూడిద రంగు టిక్, సెలబ్రెటీలకు బ్లూ టిక్ ఇస్తామంటూ ఇటీవల ప్రకటన చేసింది. అఫీషియల్ ఎకౌంట్ కలిగిన అందరూ సేమ్ బ్లూ టిక్ కలిగి ఉంటారు.

Follow Us:
Download App:
  • android
  • ios