Asianet News TeluguAsianet News Telugu

' దమ్ముంటే.. సిఎఎ అమలు చేయకుండా ఆపండి'.. మమతా బెనర్జీకి  బీజేపీ నేత బహిరంగ సవాలు 

ఆర్టికల్-370 రద్దు హామీని నెరవేర్చిన విధంగానే సీఏఏను అమలు చేస్తామన్న హామీని బీజేపీ నెరవేరుస్తుందని శుభేందు అధికారి అన్నారు. సీఏఏ కి సంబంధించి మమతా బెనర్జీకి శుభేందు అధికారి బహిరంగ సవాలు విసిరారు. దమ్ముంటే..  పశ్చిమ బెంగాల్‌ను అమలు చేయకుండా ఆపండని అన్నారు.
 

Suvendu Adhikari dares CM Mamata to stop CAA implementation in West Bengal
Author
First Published Nov 27, 2022, 11:26 AM IST

పశ్చిమ బెంగాల్ లో సవరించిన పౌరసత్వ చట్టం (సిఎఎ) అమలును ఆపాలని బీజేపీ నాయకుడు శుభేందు అధికారి ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సవాలు విసిరారు. శనివారం నార్త్ 24 పరగణాస్ జిల్లాలోని ఠాకూర్‌నగర్‌లో జరిగిన ఓ సమావేశంలో అధికారి పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.."చట్టపరమైన పత్రాలతో నివాసి యొక్క పౌరసత్వం తీసివేయబడుతుందని సీఏఏ  చట్టం చెప్పలేదని స్పష్టం చేశారు. “మేము చాలాసార్లు CAA గురించి మాట్లాడాము. రాష్ట్రంలో సీఏఏ అమలు కానుంది. మీకు దమ్ము ఉంటే, దానిని అమలు చేయకుండా ఆపండి." అని అన్నారు. 

ఆర్టికల్-370 లాగా CAA హామీ కూడా - శుభేందు అధికారి

2019 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన తర్వాత మోదీ ప్రభుత్వం కాశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేస్తామని హామీ ఇచ్చిందని, ఆ హామిని మోడీ సర్కార్ నెరవేరిందని సుభేందు అన్నారు.అదే విధంగా సీఏఏ అమలు చేస్తామన్న హామీని బీజేపీ నెరవేరుస్తుందనీ, అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఎవరి హక్కులను కాలరాయడం లేదని, ప్రతిపక్షలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. సమాజంలో ఆశాంతి యుత వాతావరణాన్ని స్రుష్టిస్తున్నారని ఆరోపించారు. 
 
సీఏఏపై అమిత్ షా ప్రకటన...

ఇంతకుముందు.. దేశ హోం మంత్రి అమిత్ షా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సిఎఎ అమలు చేయకపోవడం గురించి కలలు కంటున్న వారు పెద్ద తప్పు చేస్తున్నారు. సీఏఏ చట్టాన్ని అమలు చేయడంలో జాప్యం జరుగుతోందని, దాని గురించి ఇంకా నిబంధనలు రూపొందించాల్సి ఉందని, దానిపై పని చేయాల్సి ఉందని ఆయన అన్నారు. ఈ ఇంటర్య్వూకు ముందు కూడా అమిత్ షా తన అనేక ప్రసంగాలలో CAA అమలు గురించి ప్రస్తావించారు.

Follow Us:
Download App:
  • android
  • ios