ఉగ్రవాద సంస్థ అల్ ఖైదాతో సంబంధాలున్న అనుమానిత ఉగ్రవాది ఆరిఫ్ కర్ణాటకలోని బెంగళూరులో అరెస్ట్ చేశారు.
ఉగ్రవాద సంస్థ అల్ ఖైదాతో సంబంధాలున్న అనుమానిత ఉగ్రవాది ఆరిఫ్ కర్ణాటకలోని బెంగళూరులో అరెస్ట్ చేశారు. అంతర్గత భద్రతా విభాగం (ఐఎస్‌డీ), జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) సంయుక్త ఆపరేషన్ నిర్వహించి ఆరిఫ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆరిఫ్ వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆరిఫ్‌కు వివాహమై పిల్లలు కూడా ఉన్నారు. బెంగళూరులోని తానిసంద్రలో నివాసం ఉంటున్నాడు. అతడు ప్రస్తుతం ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న ఆరిఫ్.. వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా వర్క్ చేస్తున్నాడు. .
ఆరిఫ్ ఐఎస్‌ఐఎస్‌తో టచ్‌లో ఉన్నాడని, ఉగ్రవాద సంస్థలో చేరేందుకు సన్నాహాలు చేసుకున్నాడని ఐఎస్‌డీ అనుమానిస్తోంది. నిందితుడికి ఆల్‌ఖైదాతో ఇప్పటికే పరిచయం ఉందని భావిస్తోంది. మార్చిలో ఇరాక్ మీదుగా సిరియా వెళ్లాలని ప్లాన్ చేసుకున్నట్టుగా గుర్తించింది. ఈ క్రమంలోనే అతడిని బెంగళూరులో అరెస్ట్ చేశారు. అలాగే అతని ల్యాప్‌టాప్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే మరిన్ని ఆధారాల కోసం నగరంలోని తానిసంద్ర ప్రాంతంలోని అతని ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
