Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్‌లో ఆ విధానం కనుమరుగైంది: హైకమాండ్‌పై సుశీల్ కుమార్ షిండే వ్యాఖ్యలు

ఒకప్పుడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాలించిన కాంగ్రస్ పార్టీ నానాటీకి తన ప్రాభవాన్ని కోల్పోతున్న సంగతి తెలిసిందే. వరుసగా రెండు సార్లు ప్రతిపక్ష స్థానానికే పరిమితమవ్వడంతో పాటు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమవుతూ వస్తోంది.

Sushil Kumar Shinde says congresss tradition of debates and dialogues ended ksp
Author
New Delhi, First Published Jul 1, 2021, 5:58 PM IST

ఒకప్పుడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాలించిన కాంగ్రస్ పార్టీ నానాటీకి తన ప్రాభవాన్ని కోల్పోతున్న సంగతి తెలిసిందే. వరుసగా రెండు సార్లు ప్రతిపక్ష స్థానానికే పరిమితమవ్వడంతో పాటు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమవుతూ వస్తోంది. ఇదే సమయంలో పార్టీలో ప్రక్షాళన అవసరమని సీనియర్ నేతలు హైకమాండ్‌కు లేఖలు రాస్తున్న సంగతి తెలిసిందే. పార్టీ అధిష్టానానికి వీరవిధేయులుగా వుండే వారు ఒక్కొక్కరే విమర్శలు చేస్తూ వస్తున్నారు.

Also Read:కాంగ్రెస్‌కు మేజర్ సర్జరీ అవసరం, ఇది కూడా వాయిదా వేస్తారా: వీరప్ప మొయిలీ సంచలన వ్యాఖ్యలు

తాజాగా కేంద్ర మాజీ మంత్రి సుశీల్ కుమార్ షిండే ఒక్కసారిగా హైకమాండ్‌పై విరుచుకుపడ్డారు. పూణేలో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో షిండే మాట్లాడుతూ... పార్టీలో చర్చోపచర్చలు, సంభాషణల సంప్రదాయం కనుమరుగైపోయాయని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆత్మపరిశీలన చేసుకునే సమావేశాలు జరగాల్సి ఉందని... పార్టీ విధానాలు చాలా తప్పుగా ఉన్నాయని షిండే అన్నారు. వాటిని సవరించాల్సిన అవసరం ఉందని సుశీల్ కుమార్ షిండే వ్యాఖ్యానించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios