బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యపై సీబీఐతో విచారణ చేయించాలని బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి డిమాండ్ చేశారు. న్యాయవాది, రాజకీయ విశ్లేషకుడు ఇష్కారణ్ సింగ్ భండారీతో సుశాంత్ కేసు.. సీబీఐ విచారణకు తగినదో లేదో కనుక్కోవాలని చెప్పినట్లుగా ఆయన ట్వీట్ చేశారు.

ఈ కేసులో పోలీసుల చెబుతున్న విషయాలు సరైనవా.. కాదా అనే కోణంలో కూడా పరిశీలన చేయాలని భండారీతో చెప్పినట్లు స్వామి మరో ట్వీట్‌ చేశారు. యూట్యూబ్ లైవ్‌లో సుశాంత్ ఆత్మహత్య ఘటనపై సుబ్రమణ్య స్వామి మాట్లాడతారని ఆయన తెలిపారు.

Also Read:కరణ్‌ ఏడుస్తూనే ఉన్నాడు.. సుశాంత్‌ మరణం తరువాత విమర్శలు

ప్రస్తుతం ముంబై పోలీసులు సుశాంత్ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటిదాకా 30 మంది నుంచి స్టేట్‌మెంట్లు తీసుకున్నారు. అందులో సుశాంత్ కుటుంబసభ్యులు, స్నేహితులు, వృత్తికి సంబంధించిన వారు వున్నారు.

ఇటీవల సంజయ్ లీలా భన్సాలీ కూడా పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. ఆయన గతంలో సుశాంత్‌కు బాజీరావు మస్తానీ, రామ్‌లీలా, పద్మావత్ సినిమాలను ఆఫర్ చేశారు. అయితే డేట్స్ కుదరకపోవడం వల్లే ఆ సినిమాలు చేయలేకపోయామని భన్సాలీ పోలీసులకు తెలిపారు.

Also Read:నీ ఆలోచనతోనే నిద్ర లేస్తున్నా.. ఎందుకో: సుశాంత్‌ జ్ఞాపకాల్లో సీనియర్‌ నటి

మరోవైపు సుశాంత్ కేసుకు సంబంధించిన సమాచారం ఉంటే ఎవరైనా తనకు సాక్ష్యాధారాలతో సహా పంపొచ్చని భండారీ వెల్లడించారు. మరోవైపు సుబ్రమణ్య స్వామి కంటే ముందు బీజేపీ ఎంపీ రూపా గంగూలీ, పుస్తక రచయిత తుహిన్ సిన్హా, బీజేపీ ఎంపీ మనోజ్ తివారీతో పాటు పలువురు ప్రముఖులు కూడా సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు.