పాట్నా: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసును విచారించాలని సీబీఐని కోరింది బీహార్ రాష్ట్ర ప్రభుత్వం. ఈ విషయాన్ని జేడీ(యూ) అధికార ప్రతినిధి సంజయ్ సింగ్ కూడ ధృవీకరించారు.

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణానికి సంబంధించి విచారణను సీబీఐకి అప్పగించాలంటూ విపక్షాలతో పాటు సుశాంత్ అభిమానుల నుండి పెద్ద ఎత్తున ఒత్తిడి రావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది.

నటుడి తండ్రి కెకె సింగ్ కూడ ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని బీహార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అంతేకాదు జేడీ యూ ఎమ్మెల్యే నీరజ్ బబ్లూ కూడ ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.

also read:సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిపై సీబీఐ విచారణ: పిటిషన్ ను కొట్టేసిన సుప్రీం

ఈ ఏడాది జూన్ 14వ తేదీ నుండి సుశాంత్ సింగ్ మరణంపై సీబీఐ విచారణ చేయించాలని ఆయన అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసు విచారణను సీబీఐకి ఇచ్చేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడం లేదు. ఈ కేసు దర్యాప్తును పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.