సర్వే: మా పిల్లలను స్కూళ్లకు పంపం.. 92 శాతం మంది పేరెంట్స్ మాట

కరోనా వైరస్‌ నేపథ్యంలో భారత్‌లో తల్లిదండ్రులు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే దానిపై పేరెంట్ సర్కిల్ అనే సంస్థ ఓ జాతీయ స్థాయి సర్వే నిర్వహించింది. దేశంలోని ప్రముఖ నగరాలకు చెందిన 12,000 మంది తల్లిదండ్రులు ఈ సర్వేలో పాల్గొన్నారు.

survey 92 Indian parents unwilling to send their child back to school immediately upon reopening

కరోనా వైరస్ కారణంగా దేశంలో లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. కోవిడ్ 19 భారతీయుల జీవిన విధానాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. లాక్‌డౌన్ తర్వాత కొన్ని అంశాలు తప్పనిసరిగా జీవితంలో భాగం అవుతాయి.

సాధారణంగా పిల్లల కెరీర్‌పై అమితంగా దృష్టి కేంద్రీకరించే భారతీయ తల్లిదండ్రులు, లాక్‌డౌన్ మొదలై 50 రోజులు గడిచినా వారిని పాఠశాలకు పంపేందుకు తొందరపడటం లేదట.

కరోనా వైరస్‌ నేపథ్యంలో భారత్‌లో తల్లిదండ్రులు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే దానిపై పేరెంట్ సర్కిల్ అనే సంస్థ ఓ జాతీయ స్థాయి సర్వే నిర్వహించింది. దేశంలోని ప్రముఖ నగరాలకు చెందిన 12,000 మంది తల్లిదండ్రులు ఈ సర్వేలో పాల్గొన్నారు.

లాక్‌డౌన్ అనంతరం స్కూళ్లు తెరిచిన వెంటనే తమ పిల్లలను పంపేందుకు 92 శాతం మంది పేరెంట్స్ సుముఖంగా లేరట. ఇక 56 శాతం మంది తాము కనీసం ఒక నెల వేచిచూస్తామని, అనంతరం పరిస్ధితిని బట్టి పంపేదీ లేనిది నిర్ణయించుకుంటామని తెలిపారు.

Also Read:డిస్కంలకు రూ. 90వేల కోట్ల రుణాలు: నిర్మలా సీతారామన్

కేవలం 8 శాతం మంది మాత్రమే పాఠశాలలు తెరవగానే పంపుతామంటున్నారని... బడికి పంపేందుకు కోవిడ్ 19 పూర్తి నియంత్రణలోకి వచ్చిందనే నమ్మకం కలిగిన తర్వాతే అని స్పష్టం చేశారు.

అలాగే పిల్లల పెరుగుదలలో స్నేహితుల ప్రభావం అత్యధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో తమ పిల్లలను వారి స్నేహితులతో ఆడుకోనీయాలా వద్దా అనే విషయంలోనూ తల్లిదండ్రులు తర్జనభర్జనలు పడుతున్నారు.

అయితే తమ పిల్లలను పార్కులకు తీసుకెళ్తామని 35 శాతం మంది చెప్పారు. కనీసం ఆరు నెలల పాటు పిల్లలను ఆటల పక్కకు వెళ్లనీయమని 45 శాతం మంది చెప్పగా.. 25 శాతం తల్లిదండ్రులు మాత్రం లాక్‌డౌన్ అనంతరం వ్యక్తిగత క్రీడాంశాల్లో పాల్గొనేందుకు అనుమతిస్తారట.

Also Read:గుడ్‌న్యూస్: 2019-20 ఐటీ రిటర్న్స్‌కు నవంబర్ వరకు గడువు

ఇక సెలవులు గడిపేందుకు వివిధ ప్రదేశాలకు వెళ్లడానికి కేవలం 1 శాతం ముందే సిద్ధమంటున్నారు. అత్యథికంగా 57 శాతం మంది కొంతకాలం పాటు ప్రయాణాలు మంచివి కాదని అభిప్రాయపడ్డారు.

కాగా, 30 శాతం తల్లిదండ్రులు సెలవుల్లో ప్రయాణాల కోసం డబ్బు ఖర్చు చేయకుండా ఉద్యోగం కోల్పోవటం, జీతాలు తగ్గటం వంటి అత్యవసర పరిస్ధితుల కోసం డబ్బును దాచిపెడతామని నిర్ణయించుకున్నారు.

ఇక సామాజిక దూరం నిబంధనలు ఎత్తివేసినా ఈ సంవత్సరమంతా పిల్లల పుట్టినరోజు చేయమని 64 శాతం మంది చెప్పారు. కేవలం ఒక్క శాతం మంది మాత్రమే ఆయా చోట్లకు వెళ్తామని చెప్పారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios