అతనికి పెళ్లి కుదిరింది. మరికొద్ది రోజుల్లో అతను పెళ్లిపీటలు ఎక్కాల్సి ఉండగా... భారీ షాక్ తగిలింది. తన కాబోయే భార్య కాల్ గర్ల్ అని తెలిసి అతని దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది. ఈ సంఘటన గుజరాత్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... గుజరాత్‌లోని సూరత్ నగరానికి చెందిన ఓ యువకుడికి కొన్నాళ్ల క్రితం అదే నగరానికి చెందిన యువతితో పెళ్లి కుదిరింది. ఇద్దరూ ఫోన్ లో రోజూ మాట్లాడుకోవడం, మెసేజ్ లు చేసుకోవడం లాంటివి చేస్తున్నారు. ఓ రోజు  సదరు యువతి... తనకు కాబోయే భర్తకు తన ఫోటోలు పంపింది.  ఆ ఫొటోను అతడు తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశాడు.

కట్ చేస్తే రెండు రోజుల క్రితం ఆ యువకుడి మొబైల్ ఫోన్‌కు ఓ మెసేజ్ వచ్చింది. కాల్ గర్ల్స్ కావాలంటే వీళ్లను సంప్రదించాలంటూ కొందరు అందమైన అమ్మాయిల ఫొటోలు అందులో వచ్చాయి. వాటిని తెరిచి చూసిన యువకుడికి షాక్ తగిలింది. అందులో తన కాబోయే భార్య ఫొటో ఉంది. ఆ ఫొటో పైన ‘కాల్ గర్ల్ కాల్ అర్జంట్’ అని రాసి ఉంది. దీంతో అతడు షాక్ తిన్నాడు. ఈ విషయాన్ని తన కాబోయే భార్యకు ఫోన్ చేసి నిలదీశాడు.

AlsoRead ప్రైవేట్ బస్సు దగ్ధం: 20 మంది ప్రయాణికుల సజీవ దహనం...

మరికొన్ని రోజుల్లో పెళ్లి జరుగుతుందనగా, ఇలా తన కాబోయే భర్త తనను కాల్ గర్ల్ అనడంతో ఆ యువతికి కూడా మైండ్ బ్లాంక్ అయింది. వెంటనే తేరుకుని ఆ ఫొటో, వివరాలు తనకు పంపాలని కోరింది. అతడు ఆ వివరాలను పంపిన తర్వాత ఆమెకు అసలు విషయం అర్థమైంది.

కొన్ని రోజుల క్రితం తానే ఆ ఫొటోను కాబోయే భర్తకు పంపానని చెప్పింది. ఆ తర్వాత అతడు వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విషయం తెలుసుకుంది. అందమైన యువతి ఫొటోలను ఎవరో డౌన్ లోడ్ చేసి వాటి మీద ‘కాల్ గర్ల్’ అని రాసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నట్టు వారు తెలుసుకున్నారు. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్ చేశారు.