కన్నౌజ్: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగి 20 మంది ప్రయాణికులు సజీవ దహనమైనట్లు అనుమానిస్తున్నారు. ఏసీ బస్సు ట్రక్కును ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవిచంింది. ఉత్తరప్రదేశళ్ లోని చిలోయి గ్రామంలో శుక్రవారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది.

ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలను కాన్పూర్ ఇన్ స్పెక్టర్ జనరల్ మోహిత్ అగర్వాల్ వివరిం్చారు. ఫరుఖాబాద్ నుంచి 45  మంది ప్రయాణికులతో జైపూర్ బయలుదేరిన ఏసీ బస్సు చిలోయి వద్ద ట్రక్కును ఢీకొట్టింది. దాంతో బస్సులో మంటలు అంటుకుని వ్యాపించాయి.

ప్రమాదంలో గాయపడిన 21 మందిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. అయితే 20 మందికిపైగా మరణించి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. బలంగా ట్రక్కును ఢీకొనడంతో డీజిల్ ట్యాంక్ పగిలి భారీగా మంటలు వ్యాపించి ఉండవచ్చునని భావిస్తున్నారు. 

ప్రమాదంపై ముఖ్యమంత్రి ఆదిత్యానాథ్ విచారం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ప్రమాదంపై స్పందించారు. ప్రమాదం పట్ల తన విచారం వ్యక్తం చేశారు.