న్యూఢిల్లీ: సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు సుప్రీంకోర్టు మంగళవారం నాడు అనుమతి ఇచ్చింది.2021లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ఇది ప్రధానమైంది.

ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనంలో ఇద్దరు న్యాయమూర్తులు విస్టా ప్రాజెక్టుకు అనుకూలంగా ఉన్నారు. ఓ న్యాయమూర్తి మాత్రం ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకించారు.

కొత్త పార్లమెంట్ నిర్మాణానికి అన్ని అనుమతులు ఉన్నాయని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. పర్యావరణ చట్టాలను ఉల్లంఘిస్తూ దాఖలైన పిటిషన్లను  కోర్టు తోసిపుచ్చింది.

రూ. 20 వేల కోట్లతో పార్లమెంట్ భవనాన్ని నిర్మించనున్నారు. 

సుప్రీంకోర్టు ధర్మాసనం 2:1 మెజారిటీతో మంగళవారం నాడు తీర్పును వెల్లడించింది. ఢిల్లీ డెవలప్ మెంట్ అథారిటీ చట్టం ప్రకారం అధికారాన్ని వినియోగించుకోవడం న్యాయమైందని ధర్మాసనం అభిప్రాయపడింది. 

ఈ కేసులో పర్యావరణ కన్సల్టెంట్ ఎంపికతో పాటు నియామకం న్యాయమైందని జస్టిస్ ఎఎమ్ ఖాన్విల్కర్ ఓహ్, జస్టిస్ దినేష్ మహేశ్వరీ మెజారిటీ తీర్పును చదివారు.

ఈ ధర్మాసనంలో సభ్యుడిగా ఉన్న జస్టిస్ సంజీవ్ ఖన్నా మెజారిటీ అభిప్రాయంతో విభేదించారు.  ప్రాజెక్టు అవార్డును తప్పపట్టలేరన్నారు. 

భూమి వినియోగంలో మార్పు వచ్చినప్పుడు హెరిటేజ్ కమిటీ ముందస్తు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. భూమి వినియోగం యొక్క మరా్పు మంజూరు ప్రశ్నపై తనకు వేరే అభిప్రాయం ఉందని ఆయన చెప్పారు. 

కొత్త పార్లమెంట్ భవనానికి మోడీ సర్కార్ ప్రయత్నిస్తోంది.ఈ మేరకు గత ఏడాది డిసెంబర్ మాసంలో  ప్రధాని నరేంద్ర మోడీ ఈ పనులకు భూమి పూజ చేశారు.

ఈ మేరకు పునరాభివృద్దికి భూ వినియోగంలో మార్పులకు సంబంధించి డిసెంబర్ లో డీడీఏ 2019 డిసెంబర్ 21న నోటీఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్లను కొందరు పిటిషనర్లు సవాల్ చేశారు.