Asianet News TeluguAsianet News Telugu

నవనీత్‌కౌర్‌కి సుప్రీంలో ఊరట: ముంబై హైకోర్టు తీర్పుపై స్టే

సుప్రీంకోర్టులో ఎంపీ, సినీ నటి నవనీత్ కౌర్‌కు ఊరట లభించింది.మహారాష్ట్రలోని అమరావతి నియోజకవర్గం నుండి ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇండిపెండెంట్ అభ్యర్ధిగా ఆమె అమరావతి నుండి విజయం సాధించారు. నవనీత్ కౌర్ కుల ధృవీకరణ పత్రాన్ని ముంబై హైకోర్టు రద్దు చేసింది. దీంతో ఆమె ముంబై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 

Supreme Court Stays High Court Judgment Which Cancelled MP Navneet Kaur Rana's Caste Certificate lns
Author
New Delhi, First Published Jun 22, 2021, 2:46 PM IST

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో ఎంపీ, సినీ నటి నవనీత్ కౌర్‌కు ఊరట లభించింది.మహారాష్ట్రలోని అమరావతి నియోజకవర్గం నుండి ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇండిపెండెంట్ అభ్యర్ధిగా ఆమె అమరావతి నుండి విజయం సాధించారు. నవనీత్ కౌర్ కుల ధృవీకరణ పత్రాన్ని ముంబై హైకోర్టు రద్దు చేసింది. దీంతో ఆమె ముంబై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 

also read:క్యాస్ట్ వివాదం.. చిక్కుల్లో అందాల ఎంపీ నవనీత్, పదవికే ఎసరు..?

జస్టిస్ వినీత్ సరన్, దినేష్ మహేశ్వరిల వేకేషన్ బెంచ్  నవనీత్ కౌర్ పిటిషన్ పై విచారణ చేసింది. మహారాష్ట్రతో పాటు చట్టసభ్యుల కుల ధృవీకరణ పత్రంపై ఫిర్యాదు చేసిన వ్యక్తితో సహా ఇతరులకు ఉన్నత న్యాయస్థానం ఇవాళ నోటీసులు జారీ చేసింది. కల్పిత పత్రాలతో నవనీత్ కౌర్ మోసపూరితంగా కుల ధృవీకరణ పత్రం పొందినట్టుగా  ఫిర్యాదుపై ఆమె కుల ధృవీకరణ పత్రాన్ని జూన్ 9న రద్దు చేస్తున్నట్టుగా ముంబై హైకోర్టు ప్రకటించింది. అంతేకాదు ఆమెకు రూ. 2 లక్షల జరిమానాను కూడ విధించింది.

Follow Us:
Download App:
  • android
  • ios