Asianet News TeluguAsianet News Telugu

క్యాస్ట్ వివాదం.. చిక్కుల్లో అందాల ఎంపీ నవనీత్, పదవికే ఎసరు..?

ఆమె సమర్పించిన సర్టిఫికేట్ ఫేక్ అని తేలింది. ఆమె అసలు ఎస్సీ కులానికి చెందిన వారు కాదని.. తప్పుడు సర్టిఫికెట్లతో అమరావతి నియోజకవర్గం నుంచి పోటీ చేశారని కోర్టులో నిరూపితమైంది.

Shock to Navneet Rana, High Court canceled caste certificate, Parliament membership in danger
Author
Hyderabad, First Published Jun 8, 2021, 1:48 PM IST

సినీ నటి, అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ రానా ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. ఈ ఎన్సీపీ( నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ) కి చెందిన ఈ ఎంపీ.. ప్రస్తుతం తన పదవిని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే.. ఆమె సమర్పించిన కుల ధ్రువీకరణ పత్రాన్ని హైకోర్టు కొట్టవేసింది. దీంతో.. ప్రస్తుతం ఆమె ఎంపీ పదవికే ఎసరు వచ్చి పడింది.

ఇంతకీ మ్యాటరేంటంటే..  నవనీత్ కౌర్.. తాను ఎస్సీ అని చెప్పి ఆ సర్టిఫికేట్ చూపించి ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే.. ఆమె సమర్పించిన సర్టిఫికేట్ ఫేక్ అని తేలింది. ఆమె అసలు ఎస్సీ కులానికి చెందిన వారు కాదని.. తప్పుడు సర్టిఫికెట్లతో అమరావతి నియోజకవర్గం నుంచి పోటీ చేశారని కోర్టులో నిరూపితమైంది.

మహారాష్ట్రలోని  అమరావతి నియోజకవర్గం ఎస్సీ కులానికి కేటాయించినది కాగా.. తప్పుడు కులధ్రువీకరణ పత్రంతో ఆమె అక్కడి నుంచి పోటీ చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో.. బాంబే హైకోర్టు ఆమె సర్టిఫికేట్ ని ప్రస్తుతం క్యాన్సిల్ చేసింది. దీంతో.. ఆమె తన ఎంపీ పదవిని కూడా కోల్పోయే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆమెకు రూ.2లక్షల జరిమానా కూడా విధించారు.

ఇదిలా ఉండగా.. నవనీత్ కౌర్ పంజాబ్ రాష్ట్రానికి చెందిన వారు కావడం గమనార్హం. ఆమె లబానా అనే కులానికి చెందిన వారు కాగా..దీనిని ఎస్సీ క్యాటగిరిలో చేర్చలేదు. అయితే.. ఫేక్ సర్టిఫికెట్స్ చూపించి.. ఆమె ఎస్సీ గా క్యాస్ట్ సర్టిఫికేట్ తెచ్చుకున్నారని కోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది.

ఆ పిటిషన్ ని పరిశీలించిన న్యాయస్థానం.. ముందుగా ఈ విషయంపై పోలీసులను దర్యాప్తు చేయాల్సిందిగా ఆదేశించింది. కాగా.. తాజాగా నేడు ఈ కేసు మళ్లీ  పరిశీలనకు రాగా.. ఆమె తప్పుడు పత్రాలను సృష్టించినట్లు తెలియడంతో.. వాటిని న్యాయస్థానం కొట్టివేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios