సుప్రీంకోర్టు విశ్వసనీయత ఎవరి ప్రకటనల వల్ల తగ్గిపోదని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది. దేశ అత్యున్నత న్యాయస్థానం విశ్వసనీయత ఆకాశమంత ఎత్తులో ఉందని తెలిపింది.
సుప్రీంకోర్టు క్రెడిబిలిటీ ఆకాశమంత ఎత్తులో ఉందని బాంబే హైకోర్టు పేర్కొంది. అది వ్యక్తుల ప్రకటనలతో క్షీణించిపోదని తెలిపింది. కొలీజియం వ్యవస్థపై పలు సందర్భాల్లో బహిరంగ వ్యాఖ్యలు చేసిన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను బాంబే హైకోర్టు కొట్టి వేస్తూ వివరణాత్మక ఉత్తర్వులు విడుదల చేసింది.
‘‘భారత సుప్రీంకోర్టు విశ్వసనీయత ఆకాశాన్నంటింది. వ్యక్తుల ప్రకటనల ద్వారా అది క్షీణించబడదు. ఆటంకం వాటిల్లదు. భారత రాజ్యాంగం అత్యున్నతమైనది, పవిత్రమైనది. భారతదేశంలోని ప్రతీ పౌరుడు రాజ్యాంగానికి కట్టుబడి ఉంటాడు. రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉండాలని ఆశిస్తున్నాం. రాజ్యాంగ సంస్థలను రాజ్యాంగ అధికారులు, రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులతో పాటు అందరూ గౌరవించాలి’’ అని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీ గంగాపుర్వాలా, జస్టిస్ సందీప్ వీ మర్నేలతో కూడిన డివిజన్ బెంచ్ వ్యాఖ్యానించింది.
మరోసారి తెరమీదకు హిజాబ్ అంశం.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన కర్నాటక బాలికలు
ఉపరాష్ట్రపతి, కేంద్ర క్యాబినెట్ మంత్రి రాజ్యాంగబద్ధమైన పదువుల్లో ఉన్నందున వారిని అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ బాంబే లాయర్స్ అసోసియేషన్ దాఖలు చేసిన పిల్ విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఉప రాష్ట్రపతిగా వీపీ ధన్కర్, న్యాయశాఖ మంత్రిగా కిరణ్ రిజిజు విధులు నిర్వర్తించకుండా నిరోధించాలని పిటిషనర్లు కోరారు.
విమానయాన రంగం ప్రజలను మరింత దగ్గర చేస్తోంది.. : ప్రధాని నరేంద్ర మోడీ
అయితే నిజమైన ప్రజా తప్పిదాన్ని లేదా ప్రజా గాయాన్ని పరిష్కరించడానికి ‘పిల్’ ను ఉపయోగించవచ్చని, ఇది పబ్లిసిటీ ఆధారితంగా ఉండదని ధర్మాసనం నొక్కి చెప్పింది. పిటిషనర్లు పేర్కొన్న విధంగా రాజ్యాంగ అధికారులను తొలగించలేమని పేర్కొంది.
