కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో తన బెయిల్ షరతుల మీద సడలింపు ఇవ్వాలని గాలి జనార్ధన్ రెడ్డి సుప్రీంలో పిటిషన్ వేశారు. దాన్ని సుప్రీంకోర్టు నేడు తిరస్కరించింది.
ఢిల్లీ : కర్నాటక మాజీ మంత్రి, మైనింగ్ వ్యాపారి సుప్రీంకోర్టులో గాలి జనార్దన్ రెడ్డికి చుక్కెదురయ్యింది. ఆయన అభ్యర్ణనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. బెయిల్ షరతులను సడలించాలని కోరుతూ సుప్రీంకోర్టలో గాలి జనార్థన్ రెడ్డి పిటిషన్ వేశారు. ప్రస్తుతం కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో పార్టీ తరఫున ప్రచారానికి వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి.. బెయిల్ షరతులను సడలించాలని కోరారు. కానీ దీన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది.
కాగా, గాలి జనార్దన్ రెడ్డి కళ్యాణ రాజ్య ప్రగతి పక్షం (కేఆర్‌పీపీ) పేరుతో తన సొంత రాజకీయ పార్టీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ పార్టీనుంచి బళ్లారి నియోజకవర్గం నుంచి గాలి జనార్దన్ రెడ్డి సతీమణి అరుణలక్ష్మి అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. ప్రస్తుతం కర్ణాటకలో ఎన్నికల గాలి వీస్తుండడంతో ఈ ఎన్నికల్లో తన పార్టీనుంచి భార్య పోటీ చేస్తుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
బళ్లారి నియోజకవర్గం నుంచి బరిలోకి గాలి జనార్దన్ రెడ్డి భార్య అరుణ లక్ష్మి
కర్నాటక మాజీ మంత్రి, మైనింగ్ వ్యాపారి గాలి జనార్దన్ రెడ్డి కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పేరుతో పార్టీని ప్రకటించి బీజేపీకి షాక్ ఇచ్చారు. సొంత రాజకీయ పార్టీ కెఆర్ పీపీ నుంచే కర్ణాట ఎన్నికల్లో పోటీలో నిలిపే అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బళ్లారి నియోజకవర్గం నుంచి తన సతీమణి అరుణలక్ష్మిని బరిలోకి దింపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రచారం చేయాల్సి ఉంటుంది కాబట్టి షరతులు సడలించాలని కోరారు.
