Asianet News TeluguAsianet News Telugu

మైనర్ల అబార్షన్లను రహస్యంగా ఉంచొచ్చు. పోలీసులకు చెప్పాల్సిన అవసరం లేదు.. సుప్రీంకోర్టు..

మైనర్ల అబార్షన్ల విషయంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. 24 వారాలలోపు అబార్షన్లు చేయించుకోవచ్చని.. ఈ విషయాన్ని డాక్టర్లు పోలీసులకు చెప్పాల్సిన అవసరం లేదని చెప్పింది.

Supreme Court protects minors seeking abortion, says doctors need not disclose their identities to police
Author
First Published Oct 1, 2022, 1:04 PM IST

ఢిల్లీ : వివాహితులు, అవివాహితులనే వివక్ష లేకుండా దేశంలో మహిళందరూ 24వారాల్లో సురక్షిత గర్భవిచ్ఛిత్తి చేసుకోవచ్చంటూ.. గురువారం చరిత్రాత్మక తీర్పును వెల్లడించిన సుప్రీంకోర్టు.. మైనర్ బాలికల విషయంలో కొన్ని కీలకాంశాలను స్పృశించింది. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (ఎంటీపీ) చట్ట పరిధిని మైనర్లకూ విస్తరిస్తూ.. వారు కూడా 24 వారాల్లోపూ అబార్షన్ చేసుకోవచ్చని తెలిపింది. అంతేకాదు.. అందుకు అడ్డుగా ఉన్న పోక్సో చట్టంలోని సెక్షన్ 19(1) నుంచి వైద్యులకు రక్షణ కల్పించింది. 

ఈ సెక్షన్ ప్రకారం.. అబార్షన్ కు సంప్రదించిన మైనర్ సమాచారాన్ని రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ (ఆర్ఎంపీ).. స్థానిక పోలీసులకు తెలపాలి. లేకపోతే నేరం. ఈ నేపథ్యంలో గురువారం తీర్పులో జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం.. ఈ సెక్షన్ నుంచి వైద్యులకు మినహాయింపిచ్చింది. మైనర్ లేదా మైనర్ సంరక్షకుడి విజ్ఞప్తి మేరకు గర్భవిచ్చిత్తి వివరాలను వైద్యులు గోప్యంగా ఉంచవచ్చని పేర్కొంది. పోలీసులకు తెలియజేయాల్సిన అవసరం లేకుండా చేసింది. 

నిర్భయ గ్యాంగ్ రేప్: పదేళ్ల బాలుడిపై ముగ్గురు ఫ్రెండ్స్ లైంగికదాడి.. ప్రైవేట్ పార్టులో రాడ్లు.. బాధితుడి మరణం

ఇదిలా ఉండగా, సురక్షితమైన, చట్టబద్ధమైన అబార్షన్ ప్రక్రియకు మహిళంతా అర్హులని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ విషయంలో వివాహితులు, అవివాహితులనే వ్యత్యాసం చూపడం.. రాజ్యంగ విరుద్ధమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్  ప్రకారం రేప్ నిర్వచనంలో వైవాహిక అత్యాచారం కూడా ఉంటుందని కోర్టు తీర్పు వెల్లడించింది.

చట్టప్రకారం సురక్షితమైన అబార్షన్ ను మహిళలు.. చేయించుకోవచ్చని.. కోర్టు తెలిపింది. పెళ్లికాని మహిళలు కూడా అబార్షన్ చేసుకోవచ్చని తెలిపింది. ఒక మహిళ వైవాహిత స్థితి అమెను అబార్షన్ హక్కును హరించడానికి కారణం కారాడని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. పెళ్లికాని మహిళలు కూడా 24 వారాల్లో అవాంఛిత గర్భాన్ని తొలగించుకొనే హక్కును తొలగించడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే అని సుప్రీంకోర్టు పేర్కోంది. ఎంటీపీ చట్టం ప్రకారం పెళ్లి కాని మహిళ అబార్షన్ చేసుకోవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది. 

జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం నేడు కీలక తీర్పును వెల్లడించింది. 1971 చట్టం వివాహిత మహిళలకు సంబంధించిందన్నారు. అయితే, 2021 చట్ట సవరణ వివాహితులు, అవివాహితుల మధ్య తేడా లేదన్నారు. చట్టబద్ధమైన గర్భస్రావానికి మహిళలంటే అర్హులేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. వివాహిత, అవివాహిత స్త్రీల మధ్య కృత్రిమ వ్యత్యాసాన్ని కొనసాగించలేమని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. మహిళలు స్వేచ్ఛగా గర్భస్రావం చేసుకోనేందుకు స్వయం ప్రతిపత్తి కలిగి ఉండాలని సుప్రీంకోర్టు ధర్మానసం పేర్కొంది. 

Follow Us:
Download App:
  • android
  • ios