Asianet News TeluguAsianet News Telugu

సామాన్యుల సమస్యలను పట్టించుకోవడం లేదన్న న్యాయవాది.. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఏమన్నారు?..!

రాజ్యాంగపరమైన కేసుల కాకుండా సాధారణ కేసులను కోర్టు విచారించాలని సుప్రీంకోర్టు న్యాయవాది మాథ్యూస్ జె. నెడుంపర సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) డీవై చంద్రచూడ్‌కు మెయిల్ చేశారు. దీనిపై సీజేఐ శుక్రవారం అంటే సెప్టెంబర్ 15న భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు.

Supreme Court Not Hearing Ordinary Citizens, Lawyer Claims, cji Chandrachud Responds KRJ
Author
First Published Sep 15, 2023, 11:57 PM IST

సర్వోన్నత న్యాయస్థానం రాజ్యాంగ ధర్మాసనానికి సంబంధించిన విషయాలను మాత్రమే విచారిస్తోందని, సాధారణ పౌరుల సమస్యలను వినడం లేదన్న ఆరోపణను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఆర్టికల్ 370’ రద్దు అంశంపై కశ్మీర్ వాసుల వ్యక్తిగత పిటిషన్లు విచారిస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు. తాము ‘జాతి వాణి’ వింటున్నట్లు పేర్కొన్నారు.

విషయానికి వస్తే.. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుపై న్యాయవాది  మాథ్యూస్ నెడుంపర కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ అత్యున్నత న్యాయస్థానం కేవలం రాజ్యాంగంపై ఏర్పాటైన రాజ్యాంగ ధర్మాసనాలు మాత్రమే విచారణలు జరుపుతుందని, ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను, సాధారణ పౌరుల కేసులను వినడం లేదని ఆరోపించారు. ఈ మేరకు ఆయన సుప్రీంకోర్టుకు ఈ-మెయిల్ చేశారు. 

ప్రధాన న్యాయమూర్తికి మెయిల్ చేసిన న్యాయవాది మాథ్యూస్ జె. నెడుంపర శుక్రవారం ఒక కేసులో విచారణ నిమిత్తం సీజేఐ, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ముందు హాజరయ్యారు. విచారణ పూర్తయిన తర్వాత సీజేఐ చంద్రచూడ్ మాట్లాడుతూ.. "మిస్టర్ నెదుంపర.. మీరు లేవనెత్తిన సమస్యను విచారించాలనుకోవడం లేదు. కానీ సెక్రటరీ జనరల్ మీరు సుప్రీంకోర్టుకు వ్రాసిన ఇమెయిల్ గురించి నాకు తెలియజేసారు. రాజ్యాంగ ధర్మాసనం విచారించిన కేసులు పనికిరానివిగా పరిగణించబడుతున్నాయని అందులో మీరు చెప్పారు. అని అన్నారు.
 
రాజ్యాంగ ధర్మాసనం విషయాల ప్రాముఖ్యతను CJI చంద్రచూడ్ చెబుతూ.. “నేను మీకు చెప్పదలుచుకున్నాను.  రాజ్యాంగ ధర్మాసన విషయాల ప్రాముఖ్యత గురించి మీకు తెలియదని అనిపిస్తోంది. రాజ్యాంగ వివరణను కలిగి ఉంటుంది. ఇది భారతదేశంలో చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌కు పునాదిని ఏర్పరుస్తుంది." అని పేర్కొన్నారు. ఆర్టికల్ 370 విషయంలో తాము సామాన్యుల గొంతుకను కూడా విన్నాం.  జోక్యం చేసుకున్న వ్యక్తుల సమూహాలను విన్నాం. లోయ నుండి మమ్మల్ని ఉద్దేశించి ప్రసంగించారు. తాము దేశ స్వరాన్ని వింటున్నామని తెలిపారు. 

ఈ విషయంపై న్యాయవాది నెడుంపర మాట్లాడుతూ..  తాను అత్యున్నత న్యాయస్థానానికి ఇమెయిల్‌ను వ్రాసినట్లు అంగీకరించారు. సాధారణ పౌరుల కేసులు వినడం లేదని మాత్రమే తాను ఈ-మెయిల్ చేశానన్నారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సెప్టెంబర్ 5న సుప్రీం కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.

నెడుంపర హాజరవుతున్న మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజ్ (MSME) సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను స్వీకరించడానికి సుప్రీం కోర్టు నిరాకరించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పిటిషనర్ దానిని హైకోర్టులో సవాలు చేయలేదని, బదులుగా మేజిస్ట్రేట్ ఉత్తర్వుకు వ్యతిరేకంగా ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారనే కారణంతో పిటిషన్‌ను స్వీకరించడానికి నిరాకరించింది.

Follow Us:
Download App:
  • android
  • ios