Asianet News TeluguAsianet News Telugu

జస్టిస్‌ ఇందిరా బెనర్జీ పదవీవిరమణ .. 

సుప్రీంకోర్టులో మహిళా న్యాయమూర్తి జస్టిస్ ఇందిరా బెనర్జీ శుక్రవారం పదవీ విరమణ చేశారు. సుప్రీంకోర్టులో ఎనిమిదవ మహిళా జడ్జి అయిన ఆమెను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యుయు లలిత్ న్యాయవాద కుటుంబంలో ఆమె అత్యంత‌ విలువైన ఆభరణంగా అభివర్ణించారు. 

Supreme Court Justice Indira Banerjee Resigns
Author
First Published Sep 24, 2022, 6:21 AM IST

రానున్న రోజుల్లో అత్యున్నత న్యాయస్థానంలో ఎక్కువ మంది మహిళలు న్యాయమూర్తులుగా నియమితులు అవుతారని సుప్రీంకోర్టు సీనియర్ మహిళా న్యాయమూర్తి జస్టిస్ ఇందిరా బెనర్జీ శుక్రవారం ఆశాభావం వ్యక్తం చేశారు. అత్యున్నత న్యాయస్థానంలో ఐదవ సీనియర్‌-అత్యున్నత న్యాయమూర్తి జస్టిస్‌ ఇందిరా బెనర్జీ నాలుగేళ్లకు పైగా సేవ‌లందించిన ఆమె శుక్రవారం పదవీవిరమణ పొందారు. 

చివరి పని రోజున జస్టిస్ బెనర్జీ..  భారత ప్రధాన న్యాయమూర్తి యు యు లలిత్‌తో ఉత్సవ ధర్మాసనాన్ని పంచుకున్నారు, జస్టిస్‌ ఇందిర దాదాపు రెండు దశాబ్దాలపాటు న్యాయరంగానికి ఎనలేని సేవలు అందించారని సీజేఐ జస్టిస్‌ యూయూ లలిత్‌ ప్రశంసించారు. మనమందరం ఆమెను బెంచ్‌లో కోల్పోతాము , ఆమె ఖచ్చితంగా మన హృదయాల్లో శాశ్వతంగా ఉంటార‌ని అన్నారు. జస్టిస్ ఇందిరా బెనర్జీ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును సిజెఐ యుయు లలిత్  ప్రస్తావిస్తూ.. అది చర్రిత్రాత్మకమైనద‌ని అన్నారు. జస్టిస్ బెనర్జీ కోర్టును ఎంతో హుందాగా, ఓపికగా, ప్రేమగా వ్య‌వ‌హ‌రించే వార‌ని సీజేఐ ప్రశంసించారు. 

ఈ సంద‌ర్బంగా  జస్టిస్ ఇందిరా బెనర్జీ మాట్లాడుతూ.. ఆగస్ట్ 7, 2018న తాను జస్టిస్ (రిటైర్డ్) దీపక్ మిశ్రాతో బెంచ్‌ను పంచుకున్నప్పుడు మిగిలిన రోజులలాగే అనిపిస్తోందని, సుప్రీంకోర్టులో తన మొదటి రోజును గుర్తుచేసుకున్నారు. భవిష్యత్తులో మరింత మంది మహిళలు న్యాయమూర్తులు వస్తారని, బలహీనులకు సహకారం అందిస్తార‌ని , తక్కువ సమయంలో సమానత్వం, న్యాయం జరుగుతుందని ఆశాభావాన్ని ఆమె వ్య‌క్తం చేశారు.

తాను వ్య‌క్తిగ‌తంగా చాలా స్వేచ్చ యుతంగా ఉండాలని కోరుకుంటానని, అందువల్ల త‌న‌కు  న్యాయ‌మూర్తి  కావాలని కోరుకోలేదని ఆమె అన్నారు. కానీ, విధి చాలా విచిత్రమైనదని, 36 ఏళ్ల క్రితం ఒక కేసులో వాదించడం కోసం సుప్రీంకోర్టులో అడుగు పెట్టానని అన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నాలుగేళ్లు పని చేసిన ఇందిరా బెనర్జీ అంతకు ముందు మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు. 

1950 జనవరి 26న ఉనికిలోకి వచ్చిన సుప్రీం కోర్టు ప్రారంభమైనప్పటి.. అన‌గా 72 ఏండ్ల‌లో కేవలం 11 మంది మహిళా న్యాయమూర్తులను మాత్రమే నియ‌మితుల‌య్యారు. ఈ ప్ర‌స్తానం 1989లో జస్టిస్ ఎం ఫాతిమా బివితో ప్రారంభమైంది. న్యాయమూర్తులు సుజాత వి మనోహర్, రుమా పాల్, జ్ఞాన్ సుధా మిశ్రా, రంజనా పి దేశాయ్, ఆర్ భానుమతి, ఇందు మల్హోత్రా ఇతర మహిళాలు న్యాయమూర్తులుగా సేవ‌లందించారు.

ప్ర‌స్తుతం ఆమెతో పాటు, సుప్రీంకోర్టులోని ఇతర మహిళా న్యాయమూర్తులు జస్టిస్ హిమా కోహ్లీ, బివి నాగరత్న,  బేల ఎం త్రివేది సేవ‌లందిస్తున్నారు. జస్టిస్ బెనర్జీ సుప్రీంకోర్టుకు నియమితులైన ఎనిమిదో మహిళా న్యాయమూర్తి, ఇప్పుడు ఆమె పదవీ విరమణతో సుప్రీంకోర్టులో ముగ్గురు మహిళా న్యాయమూర్తులు ఉంటారు. ఈ కార్య‌క్ర‌మంలో అటార్నీ జనరల్ కెకె వేణు గోపాల్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వికాస్ సింగ్ తదితరులు పాల్గొని ఆమెకు శుభాకాంక్ష‌లు తెలిపారు. 

16 నెలల్లో చేయగలిగింది చేశాను: మాజీ సీజేఐ

ఇదిలావుండగా.. తన 16 నెలల పదవీ కాలంలో ఎక్కువ మంది న్యాయమూర్తులను నియమించడం ద్వారా న్యాయ వ్యవస్థను పటిష్టం చేయగలిగానని, అయినప్పటికీ పూర్తిగా చేయలేక పోయానని భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ అన్నారు. హైదరాబాద్‌లో జస్టిస్ రమణకు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందజేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. పాత చిత్రాలకు భిన్నంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినప్పటికీ నేటి సినిమాల్లో నాణ్యత లోపించిందని, దానిని సరిదిద్దాల్సిన బాధ్యత పరిశ్రమపై ఉందన్నారు. నాకు 16 నెలల సమయం ఉందని మీ అందరికీ తెలుసునని, నేను చేయగలిగినంత చేశాను. నేను ప్రతిదీ చేయలేకపోయాను, ఎందుకంటే అది సాధ్యం కాదు. న్యాయ వ్యవస్థ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండకపోవడమే ఇందుకు కారణమ‌ని అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios