Asianet News TeluguAsianet News Telugu

Ayodhya: అయోధ్య తీర్పు వెలువరించిన సుప్రీం న్యాయమూర్తులకు ప్రాణ ప్రతిష్టకు ఆహ్వానం

అయోధ్య తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు అయోధ్య ఆహ్వానం అందింది. జనవరి 22న నిర్వహిస్తున్న ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరు కావాలని ఐదుగురు న్యాయమూర్తులకు ఆహ్వానం అందింది.
 

supreme court judgest who delivered ayodhya verdict invited for ayodhya for consecratino ceremony kms
Author
First Published Jan 19, 2024, 3:35 PM IST

Supreme Court: ఈ నెల 22వ తేదీన అయోధ్యలో నిర్మితం అవుతున్న రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమం కోసం దేశంలో పలు రంగాలకు చెందిన ప్రముఖులను ట్రస్ట్ ఆహ్వానించింది. ఇందులో భాగంగా అయోధ్య తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులనూ ఆహ్వానించింది.

నాలుగేళ్ల క్రితం సుప్రీంకోర్టు రామ జన్మభూమి-బాబ్రీ మసీదు కేసు విషయంలో తీర్పు వెలువరించింది. ఐదుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. వివాదాస్పద స్థలంలో రామ మందిరాన్ని ఒక ట్రస్టు‌తో నిర్మాణం చేయించాలని, అలాగే, అయోధ్యలోనే మసీదు నిర్మించుకోవడానికి వేరే స్థలం కేటాయించాలని ఆదేశించింది. ఆ తీర్పు వెలువరించే సమయంలో దేశ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రంజన్ గొగోయ్ ఉన్నారు.

Also Read : Richest Family: ప్రపంచంలోనే ధనిక కుటుంబం ఆస్తులు.. 700 కార్లు, 8 జెట్ ఫ్లైట్లు, రూ. 4 వేల కోట్ల ప్యాలెస్

రంజన్ గొగోయ్ సహా మాజీ సీజేఐ ఎస్ఎ బాబ్డే, ప్రస్తుతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు అశోక్ భూషణ్, ఎస్ అబ్దుల్ నజీర్‌లు ఆ ఐదుగురు సభ్యుల రాజ్యధర్మాసంలో ఉన్నారు. ఈ న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనమే 2019లో అయోధ్య తీర్పు వెలువరించింది. ఆ తర్వాతే అయోధ్యలో రామ మందిర నిర్మాణం ప్రాంభమైంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios