ప్రపంచంలోనే అత్యంత సంపన్న కుటుంబం అబుదాబిలో నివసిస్తున్నది. యూఏఈ ప్రెసిడెంట్ షేక్ మొహమద్ బిన జాయెద్ అల్ నహయాన్ కుటుంబమే ప్రపంచంలోకెల్లా అత్యంత ధనిక కుటుంబం. ఈ కుటుంబం వద్ద 700 కార్లు, 8 జెట్ ఫ్లైట్లు, 94 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన రూ. 4 వేల కోట్ల విలువైన ప్యాలెస్‌ ఉన్నది. 

Richest Family: ప్రపంచంలోనే ధనిక కుటుంబం ఆస్తులు చూస్తే విస్తూపోయేలా ఉన్నాయి. దుబాయ్‌కి చెందిన అల్ నహయాన్ రాజ కుటుంబం ప్రపంచంలోనే అత్యంత సంపన్న కుటుంబం. ఈ కుటుంబం వద్ద 700 కార్లు ఉన్నాయి. 8 జెట్ ఫ్లైట్లు ఉన్నాయి. రూ. 4,078 కోట్ల విలువైన ప్యాలెస్(మూడు పెంటగాన్‌లకు సరిపోలే సైజులో ఉంటుంది) ఉన్నది. జీక్యూ రిపోర్టు ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

యూఏఈ ప్రెసిడెంట్ షేక్ మొహమద్ బిన్ జాయెద్ అల్ నహయాన్ ఈ కుటుంబ పెద్ద. ఈయనకు 18 మంది సోదరులు, 11 మంది సోదరీమణులు ఉన్నారు. అలాగే.. 9 మంది సంతానం, 18 మంది మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారు.

Scroll to load tweet…

ప్రపంచంలోనే చమురు నిల్వల్లో ఆరు శాతం ఈ కుటుంబానివే. ఫేమస్ ఫుడ్ బాల్ క్లబ్ మాంచెస్టర్ సిటీ ఫుట్ బాల్ క్లబ్ వీరిదే. అలాగే.. ఎలన్ మస్క్ ఎక్స్ మొదలు చాలా పెద్ద కంపెనీల్లో పెట్టుబడులు ఉన్నాయి. ఈయన తమ్ముడు షేక్ హమద్ బిన్ హమదాన్ అల నహయాన్‌కు 700 కార్లు ఉన్నాయి. ఇందులో ప్రపంచంలోనే అతిపెద్ద ఎస్‌యూవీ, ఐదు బుగాటీ వేరాన్స్, ఒక లాంబోర్గిని రెవెంటాన్, ఒక మెర్సిడస్ బెంజ్ సీఎల్కే జీటీఆర్, ఒక ఫెరారీ 599ఎక్స్ఎక్స్, మెక్ లారెన్ ఎంసీ 12 కార్లు కూడా ఉన్నాయి.

Also Read: Ayodhya: ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి చంద్రబాబు.. అయోధ్యకు 21న ప్రయాణం

ఈ కుటుంబం అబుదాబిలోని ఖసర్ అల్ వతన్ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్‌లో నివసిస్తుంది. యూఏఈలోని అన్ని ప్యాలెస్‌లోకెల్లా ఇదే పెద్దది. సుమారు 94 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్యాలెస్ ఉన్నది. 

ప్రెసిడెంట్ సోదరుడు తహనన్ బిన్ జాయెద్ అల్ నహయన్ కుటుంబ ముఖ్యమైన ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ బాధ్యతలు చూస్తారు. ఈ కంపెనీ గత ఐదేళ్లలోనే 28 వేల శాతం దాని విలువను పెంచుకుంది. 235 బిలియన్ డాలర్ల విలువైన ఈ కంపెనీ వ్యవసాయం, ఇంధన, వినోదం, మేరిటైమ్ బిజినెస్‌లను చూస్తున్నది. ఈ కంపెనీల్లో పదుల వేల మంది ఉద్యోగులుగా ఉపాధి పొందుతున్నారు.