ఐఎన్ఎక్స్ మీడియా కేసు: చిదంబరంకు బెయిల్, 106 రోజుల తర్వాత బయటికి

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరానికి ఊరట లభించింది. ఈ కేసులో ఢిల్లీ హైకోర్టు ఆయనకు బెయిల్ ఇవ్వకపోవడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌న విచారించిన సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.

Supreme Court grants bail to P Chidambaram in INX Media case

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరానికి ఊరట లభించింది. ఈ కేసులో ఢిల్లీ హైకోర్టు ఆయనకు బెయిల్ ఇవ్వకపోవడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌న విచారించిన సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.

106 రోజులుగా తీహార్ జైల్లో ఉన్న చిదంబరం ఎట్టకేలకు విడుదల కానున్నారు. రెండు లక్షల పూచీకత్తుగా సమర్పించాలని, మీడియాతో  మాట్లాడరాదని జస్టిస్ ఆర్. భానుమతితో కూడిన ధర్మాసనం ఆదేశించింది.

Also Read:చిదంబరానికి మళ్లీ నిరాశే.. బెయిల్ పిటిషన్ తిరస్కరణ

ఆర్థిక నేరాలు తీవ్రమైనవప్పటికి కూడా ప్రతీ కేసును విడి విడిగా చూడాలన్న ధర్మాసనం చిదంబరానికి బెయిల్ మంజూరు చేసింది. కస్టడీలో ఉన్న సమయంలో కూడా సాక్ష్యాలను తారుమారు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వాదించింది.

మనీలాండరింగ్ లాంటి ఆర్ధిక నేరాలు, ఆర్ధిక వ్యవస్ధను తీవ్రంగా ప్రభావితం చేస్తాయని ఈడీ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరానికి ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ప్రమేయం లేదని కపిల్ సిబాల్‌తో పాటు అభిషేక్ మను సింఘ్వీ వాదించారు.

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అవినీతి జరిగిందంటూ ఆగస్టు 21న సీబీఐ చిదంబరాన్ని అరెస్ట్ చేసింది. సీబీఐ పెట్టిన కేసులో బెయిల్ మంజూరైన అప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా చిదంబరం చుట్టూ ఉచ్చు బిగించడంతో ఆయన జైలుకే పరిమితమయ్యారు.

Also Read:చిదంబరానికి షాక్: కోర్టు ఆదేశాలు, మరో అరెస్ట్ తప్పదా?

2007లో కేంద్ర ఆర్థిక మంత్రి హోదాలో ఉన్న ఆయన ఐఎన్ఎక్స్ మీడియాలోకి రూ.305 కోట్ల విదేశీ నిధులను తరలించడంలో ఆర్ధిక మంత్రి హోదాలో క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారన్నది చిదంబరంపై ఉన్న అభియోగం. తండ్రికి బెయిల్ లభించడంతో కార్తీ చిదంబరం హర్షం వ్యక్తం చేశారు. 106 రోజుల తర్వాత బెయిల్ వచ్చిందంటూ కార్తీ ట్వీట్ చేశారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios