ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరానికి మరోసారి నిరాశే ఎదురైంది. ఈ కేసులో చిదంబరం తరపు న్యాయవాది దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారించిన ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరించింది.

ఈ ఫిర్యాదుపై ఈ నెల 8న చిదంబరం దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఇరువర్గాల వాదనలను విన్న జస్టిస్ సురేశ్ కైత్ విచారణను వాయిదా వేశారు. దీనిపై శుక్రవారం మరోసారి విచారించిన ఢిల్లీ హైకోర్టు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది.

చిదంబరం జ్యూడిషియల్ కస్టడీని పొడిగించాలని కోరుతూ ఈడీ పిటిషన్‌ను ఆమోదిస్తూ.. ఈ నెల 27 వరకు ఆయన కస్టడీని పొడిగించిన విషయం తెలిసిందే. 

Also Read:electionresults2019 video : చడీ చప్పుడు లేకుండా దేశభక్తి కండలు తిరిగిన జాతీయతను ఓడిస్తుంది

మాజీ కేంద్ర ఆర్థికమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత చిదంబరం అస్వస్థతకు గురయ్యారు. ఐఎన్‌ఎక్స్ మీడియా కుంభకోణం కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఆయన గత నెల 5న అస్వస్థతకు గురయ్యారు.  

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో భాగంగా తీహార్ జైలులో రిమాండ్ లో ఉన్న ఆయన కడుపు నొప్పితో బాధపడటంతో జైలు సిబ్బంది అప్రమత్తమైంది. వెంటనే ఆయన్ను ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించింది. ప్రస్తుతం ఆయన కోలుకున్నట్లు సమాచారం. 

Also Read:INX Media case: చిదంబరంకు ఊరట, సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు

ఇకపోతే జైల్లో తనకు అందిస్తున్న ఆహారం సరిపోవడం లేదని కోర్టుకు విన్నవించుకున్నారు. ఆహారం అందకపోవడం వల్ల నాలుగు కిలోల బరువు తగ్గానని పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు కోర్టుకు తెలిపారు. తనకు ఇంటి భోజనం తెప్పించుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఇటీవలే కోర్టును కోరారు.

కాగా.. ఐఎన్ఎక్స్ మీడియా కేసు, కేసులో ఆగస్టు 21న సీబీఐ ఆయనను అరెస్ట్ చేసింది. అనంతరం సుప్రీంకోర్టు చిదంబరానికి బెయిల్ మంజూరు చేసింది. ఇదే సమయంలో మనీలాండరింగ్‌కు పాల్పడినట్లుగా అభియోగాలు ఎదుర్కొన్న ఆయనను అక్టోబర్ 22న ఎన్‌ఫోర్‌మెంట్ అధికారులు అరెస్ట్ చేయగా.. 27 వరకు చిదంబరం ఈడీ కస్టడీలోనే ఉన్నారు. 

Also Read:చిదంబరానికి షాక్: కోర్టు ఆదేశాలు, మరో అరెస్ట్ తప్పదా?