ఢిల్లీ లిక్కర్ స్కామ్.. మనీష్ సిసోడియాకు దక్కని ఊరట.. బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీం..

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అక్రమాలకు సంబంధించిన కేసుల్లో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది.

Supreme Court dismisses bail pleas of Manish Sisodia in alleged Delhi Liquor Scam ksm

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అక్రమాలకు సంబంధించిన కేసుల్లో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించిన అవినీతి, మనీలాండరింగ్ కేసుల్లో ఆయన బెయిల్ పిటిషన్‌లను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. 338 కోట్ల రూపాయల చేతులు మారాయనే దానికి సంబంధించి అంశం తాత్కాలికంగా నిర్ధారించబడిందని బెంచ్ గమనించిందని న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్విన్ ఎస్వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. అందుకే తాము బెయిల్ కోసం చేసిన దరఖాస్తులను తిరస్కరిస్తున్నామని తెలిపింది. 

అయితే ఈ కేసు విచారణను ఆరు నుంచి ఎనిమిది నెలల్లో పూర్తి చేస్తామని ప్రాసిక్యూషన్ హామీ ఇచ్చిందని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. అందువల్ల మూడు నెలల్లో, విచారణ మందకొడిగా లేదా నెమ్మదిగా సాగితే.. మనీష్ సిసోడియా బెయిల్ కోసం దరఖాస్తును దాఖలు చేయడానికి అర్హులుని ధర్మాసనం తెలిపింది. 

అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి మనీష్ సిసోడియా బెయిల్ అభ్యర్థనలను దిగువ కోర్టులు తిరస్కరించడంతో ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈ నెల ప్రారంభంలో తన తీర్పును రిజర్వ్ చేసింది. డిల్లీ లిక్కర్‌ స్కామ్‌కు సంబంధించి తనపై రెండు వేర్వేరు కేసుల్లో బెయిల్ కోసం మనీష్ సిసోడియా ప్రయత్నించారు. అందులో ఒకటి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కేసు కాగా, మరొకటి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన కేసు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios