సుప్రీంలో ఏం జరుగుతుందో.. ఇకపై లైవ్‌‌లో చూడొచ్చు

supreme court allows live streaming of court proceedings
Highlights

న్యాయస్థానంలో ప్రతినిత్యం జరిగే వాదనలను ప్రత్యక్ష ప్రసారం చేయడానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా అంగీకారం తెలిపారు

దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఏం జరుగుతుందో... సుప్రీంకోర్టులో విచారణలు.. వాదనలు ఎలా జరుగుతాయో చూడాలని చాలామందికి ఉంటుంది. కానీ కొన్ని కారణాల వల్ల సుప్రీం దానిని అనుమతించలేదు.. అయితే ఇకపై వీరి కల నెరవేరనుంది.. న్యాయస్థానంలో ప్రతినిత్యం జరిగే వాదనలను ప్రత్యక్ష ప్రసారం చేయడానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా అంగీకారం తెలిపారు.

సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ దీపక్ మిశ్రా, ఏఎం ఖాన్ విల్కర్, డీవై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం..  జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాలపై జరిగే వాదనలను ప్రత్యక్ష ప్రసారం చేయడానికి సుప్రీం సానుకూలంగానే ఉందని.. దానికి కావాల్సిన మార్గదర్శకాలను కేంద్రం సూచించాలని న్యాయస్థానం అభిప్రాయపడింది.. ఈ అంశంపై జూలై 23లోగా కేంద్రప్రభుత్వం తన స్పందన తెలియజేయాలని సూచించింది.

తొలుత ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో జరిగే విచారణలను లైవ్ స్ట్రీమింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తామని.. ఆపై దశలవారీగా మిగతా కోర్టు రూముల్లో కెమెరాలు ఏర్పాటు చేస్తామని.. అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ ధర్మాసనానికి తెలిపారు.

loader