Asianet News TeluguAsianet News Telugu

చార్​ధామ్​ రహదారి ప్రాజెక్టుకు మార్గం సుగమం.. కేంద్రం వాదనతో ఏకీభవించిన త్రిసభ్య ధర్మాసనం

చార్ ధామ్ జాతీయ రహదారి ప్రాజెక్టులో (Char Dham project) భాగంగా రోడ్ల విస్తరణకు (Road Widening) సుప్రీంకోర్టు మార్గం (Supreme Court) సుగమం చేసింది. జాతీయ భద్రతను (National Security)  దృష్టిలో ఉంచుకుని చార్​ధామ్​ జాతీయ రహదారి ప్రాజెక్టులో రోడ్డు విస్తరణకు దేశ అత్యున్నత న్యాయస్థానం అనుమతులిచ్చింది.
 

Supreme Court agrees with centre over Char Dham Road Widening
Author
New Delhi, First Published Dec 14, 2021, 3:22 PM IST

చార్ ధామ్ జాతీయ రహదారి ప్రాజెక్టులో (Char Dham project) భాగంగా రోడ్ల విస్తరణకు (Road Widening) సుప్రీంకోర్టు మార్గం (Supreme Court) సుగమం చేసింది. జాతీయ భద్రతను (National Security)  దృష్టిలో ఉంచుకుని చార్​ధామ్​ జాతీయ రహదారి ప్రాజెక్టులో రోడ్డు విస్తరణకు సుప్రీంకోర్టు అనుమతులిచ్చింది. ఆ ప్రాంతంలో విశాలమైన రోడ్లు వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగి ఉన్నాయనే ప్రభుత్వ వాదనలతో జస్టిస్ డీవై చంద్రచూడ్(Justice DY Chandrachud) , జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్‌నాథ్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఏకభవించింది.  ఈ ప్రాజెక్టును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై మంగళవారం త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. సరిహద్దు భద్రతా సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఇటీవలి కాలంలో కాలంలో "జాతీయ భద్రతకు తీవ్రమైన సవాళ్లు" ఉన్నందున.. భద్రతా దళాలు, సామాగ్రి తరలింపు అవసరమని తెలిపింది. రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రత్యేక సంస్థ అని.. దాని ఆపరేషన్ అవసరాలను నిర్ణయించగలదని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది.

సరిహద్దులను రక్షించేందుకు సాయుధ బలగాల మౌలిక సదుపాయాల అవసరాలను తీర్చవలసి ఉంటుందని కోర్టు తెలిపింది. ఈ రహదారులు వ్యుహాత్మక ప్రాముఖ్యత కలిగి ఉన్నందును.. వీటిని ఇతర కొండ ప్రాంతాల్లో ఉన్న రహదారుల మాదిరిగా పరిగణించలేమని కోర్టు పేర్కొంది. అలాగే పటిషనర్ పర్యావరణ ఆందోళనపై సుప్రీం కోర్టు పరిగణలోని తీసుకుంది. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏకే సిక్రీ నేతృత్వంలో పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ప్రాజెక్టు పురోగతిపై ప్రతి నాలుగు నెలలకోసారి ఈ కమిటీ సుప్రీం కర్టుకు నివేదికను సమర్పించనుంది. ఇందులో నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్రతినిధులు కూడా ఉంటారు. అయితే ఇప్పటికే ఉన్న సిఫార్సుల అమలును నిర్ధారించడం ఈ కమిటీ లక్ష్యం.

Supreme Court agrees with centre over Char Dham Road Widening

ఉత్తరాఖండ్‌లోని పవిత్ర పుణ్యక్షేత్రాలైన యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్‌లను కలిపే విధంగా 900 కిలోమీటర్ల పొడువైన రోడ్ల నిర్మాణం కోసం చార్‌ధామ్ ప్రాజెక్టును కేంద్రం చేప్టటింది. ఏ కాలంలోనైనా ప్రయాణించేందుకు అనువుగా ఈ రోడ్లను నిర్మిస్తున్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం రూ. 12,000 కోట్లను వెచ్చించనుంది. అయితే ఈ ప్రాజెక్టును సవాలు చేస్తూ సిటిజెన్స్ ఫర్ గ్రీన్ డూన్ (Citizens for Green Doon) అనే స్థానిక ఎన్‌జీవో సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అయితే ఈ క్రమంలోనే సుప్రీం కోర్టు గతంలో వెలువరించిన ఆదేశాలను సవరించాలంటూ రక్షణ మంత్రిత్వ శాఖ సుప్రీం కోర్టును అభ్యర్థించింది. 

ఈ క్రమంలోనే గత నెలలో కేంద్రం తరఫున కేకే వేణు గోపాల్ వాదనలు వినిపించారు. చైనా సరిహద్దుల వరకు క్షిపణులను, లాంచర్లను మోసుకెళ్లడానికి పెద్ద పెద్ద వాహనాలు కావాలని అన్నారు. భారత్ ఆయుధాలను తరలించకపోవతే.. ఒకవేళ చైనా విరుచుకుపడితే యుద్దం ఎలా చేస్తుందనే ప్రశ్నను కోర్టు ముందు ఉంచారు. 

Follow Us:
Download App:
  • android
  • ios