సుప్రీంకోర్టు జగన్ మీద దాఖలైన ఓ పిటిషన్ విచారణను వాయిదా వేసింది. అప్పటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారంటూ ఈ పిటిషన్ దాఖలయ్యింది. 

ఢిల్లీ : అప్పటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణపై సీఎం జగన్ లేఖ రాయడం మీద దాఖలైన పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. న్యాయమూర్తిపై సహించరాని వ్యాఖ్యలు చేశారంటూ న్యాయవాది సునీల్ కుమార్ సింగ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సుందరేశ్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం గురువారం దీనిపై విచారణ జరిపింది. మీరెవరు, దేన్ని సవాలు చేశారని జస్టిస్ ఎంఆర్ షా ప్రశ్నించారు. తాను పిటిషనర్ నని, సీఎం జగన్ ప్రవర్తనను సవాలు చేశానని సింగ్ తెలిపారు. 

‘సీఎం జగన్ అప్పటి సుప్రీంకోర్టు న్యాయమూర్తితో సహించరాని వ్యాఖ్యలు చేస్తూ సీజేఐకి లేఖ రాశారు. ఆ విషయం మీడియాకూ చెప్పారు. అన్ని దిన పత్రికల్లో కూడా అదే వచ్చింది. అదే రోజు నేను పిటిషన్ దాఖలు చేశాను..’ అని సింగ్ ధర్మాసనానికి తెలిపారు. దీని మీద జోక్యం చేసుకున్న జస్టిస్ షా ఈ కేసుకు గత ప్రభుత్వ నిర్ణయాల పునఃసమీక్ష కేసు ఏం సంబంధం… రెండింటిని ఎందుకు కలిపారని ప్రశ్నించారు. 

బంగాళాఖాతంలో అల్పపీడనం.. తుఫాను వచ్చే అవకాశముందన్న వాతావరణ శాఖ

గతంలో విచారణకు వచ్చినప్పుడు నాటి ధర్మాసనం చేసిందని మరో రెండు పిటిషన్లు కొట్టేసి దీనిని మనుగడలో ఉంచారని సింగ్ తెలిపారు. ముఖ్యమంత్రి చేసిన ప్రకటన ఉందా? అని జస్టిస్ షా ప్రశ్నించారు.. లేఖ ఉందంటూ అందులో విషయాలు చెప్పేందుకు ప్రయత్నించగా.. చదవొద్దని ధర్మాసనం సూచించింది.. ఆ తర్వాత గత ప్రభుత్వ నిర్ణయాల పునఃసమీక్ష సవాలు కేసు నుంచి ఈ కేసును వేరుచేసి.. ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 12 కు వాయిదా వేసింది