శ్రీదేవిలానే సన్నీ కూడా..

Sunny Leone Deserves Respect Like Any Other Mainstream Actress: Hardik Patel
Highlights

సన్నీలియోన్ పై హార్థిక్ కామెంట్..

బాలీవుడ్ అందాల తార సన్నీ లియోన్‌పై పటీదార్‌ ఉద్యమ నేత హర్ధిక్‌ పటేల్‌ ఆసక్తికర వ్యాఖ్యాలు చేశారు. మధ్యప్రదేశ్‌లోని ఓటర్లను చైతన్య పరచడానికి హర్ధిక్‌ జూలైలో యాత్ర చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో సన్నీ లియోన్‌ గురించి అడిగిన ఓ ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. ఆమెకు తమ మద్దతు ఉంటుందని తెలిపారు. మిగతా బాలీవుడ్‌ హీరోయిన్లలాగానే సన్నీని చూడాలన్నారు.

గతంతో సంబంధం లేకుండా ఓ నటిగా సన్నీ తనను తాను నిరూపించుకుందని.. తెరపై దానిని మాత్రమే చూడాలని పేర్కొన్నారు. బాలీవుడ్‌ హీరోయిన్లు నర్గీస్‌, శ్రీదేవి, మూధురి దీక్షిత్‌లా సన్నీని చూడటంలో తప్పేంటని ప్రశ్నించారు. ఇప్పుడు కూడా సన్నీని ఓ పోర్న్‌స్టార్‌లానే చూస్తే.. ఈ దేశం బాగుపడదని హర్ధిక్‌ వ్యాఖ్యానించారు. గతంలో కూడా హర్ధిక్‌ సన్నీకి మద్దతుగా మాట్లాడిన సంగతి తెలిసిందే. ఇక, బీజేపీ అధికారం కోసం వెంపర్లాడుతోందని హార్థిక్‌ విమర్శించారు. ఒకవేళ 2019లో మోదీ అధికారంలోకి వస్తే ఈ దేశంలో మళ్లీ ఎన్నికలు  జరగవేమోనంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

loader