కరోనా విజృంభణ: యూపీలో లాక్‌డౌన్.. మాస్క్ లేకుంటే రూ.10 వేల జరిమానా
దేశంలో కరోనా వైరస్ కోరలు చాస్తోంది. రోజుకు 2 లక్షలకు పైగా కేసులతో అమెరికాను క్రాస్ చేసే స్థాయిలో విజృంభిస్తోంది. ఇప్పటికే వైరస్‌ను కట్టడి చేసేందుకు గాను పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూలు అమలు చేస్తున్నారు
దేశంలో కరోనా వైరస్ కోరలు చాస్తోంది. రోజుకు 2 లక్షలకు పైగా కేసులతో అమెరికాను క్రాస్ చేసే స్థాయిలో విజృంభిస్తోంది. ఇప్పటికే వైరస్‌ను కట్టడి చేసేందుకు గాను పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూలు అమలు చేస్తున్నారు.
తాజాగా ఈ లిస్ట్‌లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా చేరింది. రాష్ట్రంలో రోజురోజుకీ కరోనా కేసులు పెరిగిపోతుండంతో ఆదివారం లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ లాక్‌డౌన్ రాష్ట్రమంతటా వర్తిస్తుందని అయితే అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు ఉంటుందని తెలిపింది.
దుకాణాలు, షాపులు, మాల్స్.. ఇలా అన్నీ రకాల వాణిజ్య సముదాయాలను మూసేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రజలందరూ విధిగా మాస్క్ ధరించాలని, లేదంటే 1000 రూపాయల జరిమానాను విధిస్తామని సర్కార్ ప్రకటించింది.
Also Read:ఇవి కూడా కరోనా లక్షణాలే.. అశ్రద్ధ చేయకండి..!
రెండోసారీ మాస్క్ లేకుండా పట్టుబడితే పది వేల రూపాయల జరిమానాను విధించనున్నారు. మరోవైపు రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో శుక్రవారం సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశం ముగిసిన తర్వాత ఆదివారం లాక్‌డౌన్ విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే వారణాసిలో మాత్రం శని, ఆదివారాల్లో లాక్‌డౌన్ అమల్లో ఉంటుంది. అత్యవసర సర్వీసులు, పాలు, పెరుగు, కూరగాయల దుకాణాలు మాత్రం ఉదయం 10 గంటల నుంచి తెరిచి ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది.