Telugu News Live : నేటి ముఖ్యాంశాలివే

Sunday 11th september telugu news live

తెలుగు రాష్ట్రాల్లోని తాజా వార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, క్రీడా, సినీ, క్రైమ్, బిజినెస్ వార్తలను ఎప్పటికప్పుడు ఏషియానెట్ తెలుగు లైవ్ అఫ్ డేట్స్ ద్వారా అందిస్తున్నాం. జస్ట్ వన్ క్లిక్‌తో నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు మీ కోసం...

1:01 PM IST

బిఏసి సభ్యులుగా మంత్రులు పెద్దిరెడ్డి, జోగి రమేష్.. వైఎస్ జగన్ నిర్ణయం

ఇటీవలే మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ చేపట్టిన సీఎం జగన్ అందుకు తగ్గట్లుగా బిఏసి సభ్యుల నియామకం చేపట్టారు. గతంలో బీఏసీ సభ్యులుగా ఉన్న కన్నబాబు, అనిల్ కుమార్ స్థానంలో తాజాగా మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జోగి రమేష్ లకు  బీఏసీలో చోటు కల్పించారు. 

11:51 AM IST

వక్ఫ్ బోర్డ్ భూముల్లో నిర్మాణాల కూల్చివేత... ఉత్తరా ఖండ్ సర్కార్ కీలక నిర్ణయం

ఉత్తరా ఖండ్ వక్ఫ్ బోర్డ్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా వక్ఫ్ బోర్డ్ భూముల్లో వెలిసిన అక్రమ నిర్మాణాలను త్వరలోనే కూల్చివేయనున్నట్లు ఉత్తరాఖండ్ వక్ఫ్ బోర్డ్ నూతన అధ్యక్షుడు షాదాబ్ ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా వక్ఫ్ బోర్డుకు చెందిన 1.5 లక్షల కోట్ల విలువైన భూములు అన్యాక్రాంతం అయినట్లు... వాటిని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు షాబాద్ తెలిపారు. 
 
10:58 AM IST

గేమింగ్ కంపనీపై ఈడి దాడులు... రూ.17 కోట్లు సీజ్

పశ్చిమ బెంగాల్ రాజధాని కలకత్తా నుండి ఆపరేట్ అవుతున్న గేమింగ్ కంపనీపై చేసిన తనిఖీల్లో రూ.17కోట్లకు పైగా సీజ్ చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) ప్రకటించింది. అంతేకాదు ఈ యాప్ సంస్థకు రాజకీయ సంబంధాలున్నట్లు ఈడీ విచారణలో తేలినట్లు సమాచారం.

10:01 AM IST

తెలుగురాష్ట్రాలకు హై అలర్డ్... నేడు భారీ నుండి అతిభారీ వర్షాలు

రెండుమూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీవర్షాలతో తెలుగు రాష్ట్రాలు ముద్దవుతున్నాయి. అయితే ఈ వర్షాలు మరో రెండ్రోజులపాటు కొనసాగుతాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్త తీవ్ర అల్పపీడనంగా బలపడిందని... ఇది వాయుగుండంగా మారే అవకాశాలున్నాయని తెలిపింది. దీని ప్రభావంతో నేడు, రేపు ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుసే అవకాశాలున్నాయని హెచ్చరించారు. 

9:11 AM IST

రెబల్ స్టార్ కృష్ఱం రాజు మృతి

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. అలనాటి ప్రముఖ సినీ హీరో, తన మాస్ యాక్టింగ్ తో తెలుగు ప్రేక్షకుల నుండి రెబల్ స్టార్ బిరుదు పొందిన ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు మృతిచెందారు. ఆయన అకాల మరణంపై తెలుగు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. కృష్ణంరాజు మృతికి సంతాపం, ఆయన కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నారు. 

1:01 PM IST:

ఇటీవలే మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ చేపట్టిన సీఎం జగన్ అందుకు తగ్గట్లుగా బిఏసి సభ్యుల నియామకం చేపట్టారు. గతంలో బీఏసీ సభ్యులుగా ఉన్న కన్నబాబు, అనిల్ కుమార్ స్థానంలో తాజాగా మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జోగి రమేష్ లకు  బీఏసీలో చోటు కల్పించారు. 

11:51 AM IST:

ఉత్తరా ఖండ్ వక్ఫ్ బోర్డ్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా వక్ఫ్ బోర్డ్ భూముల్లో వెలిసిన అక్రమ నిర్మాణాలను త్వరలోనే కూల్చివేయనున్నట్లు ఉత్తరాఖండ్ వక్ఫ్ బోర్డ్ నూతన అధ్యక్షుడు షాదాబ్ ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా వక్ఫ్ బోర్డుకు చెందిన 1.5 లక్షల కోట్ల విలువైన భూములు అన్యాక్రాంతం అయినట్లు... వాటిని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు షాబాద్ తెలిపారు. 
 
10:58 AM IST:

పశ్చిమ బెంగాల్ రాజధాని కలకత్తా నుండి ఆపరేట్ అవుతున్న గేమింగ్ కంపనీపై చేసిన తనిఖీల్లో రూ.17కోట్లకు పైగా సీజ్ చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) ప్రకటించింది. అంతేకాదు ఈ యాప్ సంస్థకు రాజకీయ సంబంధాలున్నట్లు ఈడీ విచారణలో తేలినట్లు సమాచారం.

10:01 AM IST:

రెండుమూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీవర్షాలతో తెలుగు రాష్ట్రాలు ముద్దవుతున్నాయి. అయితే ఈ వర్షాలు మరో రెండ్రోజులపాటు కొనసాగుతాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్త తీవ్ర అల్పపీడనంగా బలపడిందని... ఇది వాయుగుండంగా మారే అవకాశాలున్నాయని తెలిపింది. దీని ప్రభావంతో నేడు, రేపు ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుసే అవకాశాలున్నాయని హెచ్చరించారు. 

9:11 AM IST: