మనీలాండరింగ్ కేసులో తీహార్‌ జైల్లో వున్న సుఖేష్ చంద్రశేఖర్ శనివారం మరో లేఖ విడుదల చేశారు. ‘‘తీహార్ క్లబ్’’కు వస్తున్నారంటూ కవిత, కేజ్రీవాల్‌కు సుఖేష్ చంద్రశేఖర్ స్వాగతం పలికారు. 

మనీలాండరింగ్ కేసులో తీహార్‌ జైల్లో వున్న సుఖేష్ చంద్రశేఖర్ శనివారం మరో లేఖ విడుదల చేశారు. 5 పేజీల లేఖను ఆయన విడుదల చేశారు. ఈసారి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫోన్ నెంబర్లు వున్న ‘‘స్క్రీన్ షాట్స్’’ను ఆయన విడుదల చేశారు. ‘‘తీహార్ క్లబ్’’కు వస్తున్నారంటూ కవిత, కేజ్రీవాల్‌కు సుఖేష్ చంద్రశేఖర్ స్వాగతం పలికారు. అతి త్వరలోనే కేజ్రీవాల్‌తో జరిపిన చాట్స్‌ను విడుదల చేస్తానంటూ ఆయన బాంబు పేల్చారు. ట్విట్టర్ల ద్వారా సమాధానాల ఇవ్వొద్దన్న సుఖేష్.. ఇవన్నీ పాత ట్రిక్కులని పనిచేయవని వ్యాఖ్యానించాడు. 

తనను దొంగ, ఆర్ధిక నేరగాడిని అంటూ విమర్శించారని, మీరు కూడా అందులో భాగస్వాములేనంటూ సుఖేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ధైర్యం వుంటే సరైన రీతలో, సక్రమంగా విచారణ జరిగేలా సహకరించాలని కవితకు సుఖేష్ చంద్రశేఖర్ సవాల్ విసిరారు. కవతను కవితక్క అని సంబోధించానని, ఆమెను తన పెద్దక్కగా భావించానని ఆయన చెప్పాడు. దేశ ప్రజా ప్రయోజనాల రీత్య సత్యం మాట్లాడాలని సుఖేష్ హితవు పలికాడు. తనను రాజకీయంగా ప్రభావితం చేస్తున్నారన్న విమర్శలు అర్ధరహితమని.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని సంచలన ప్రకటన చేశాడు. 

Also Read: సుఖేష్‌ చంద్రశేఖర్ మరో సంచలనం.. కవితక్క-టీఆర్ఎస్‌ పేరుతో జరిపిన చాటింగ్ విడుదల..?

కాగా.. మనీలాండరింగ్ కేసులో ఢిల్లీలోని తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న సుఖేష్ చంద్రశేఖర్ వరుసపెట్టి లేఖలు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో చేసిన ఛాటింగ్‌ అంటూ అతను విడుదల చేసిన స్క్రీన్ షాట్లు కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో కవిత స్పందించారు. బీఆర్ఎస్ పార్టీపై ఉద్దేశ్యపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. కేసీఆర్‌ను ఎదుర్కొనే ధైర్యం లేకే తనను టార్గెట్ చేస్తున్నారని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. సుఖేష్‌ తో తనకు ఎలాంటి పరిచయం లేదని.. ఫేక్ ఛాట్‌లతో దుష్ప్రచారం చేస్తున్నారని కల్వకుంట్ల కవిత ఆరోపించారు. సుఖేష్ వ్యవహారంపై కవిత గురువారం లేఖను విడుదల చేశారు. 

అంతకుముందు ఏప్రిల్ 12న విడుదల చేసిన లేఖలో ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి బీఆర్ఎస్‌ నేతలతో తన వాట్సాప్ చాట్‌‌ను బయటపెడుతున్నట్టుగా తెలిపారు. చాటింగ్‌కు సంబంధించిన ఆరు పేజీల లేఖను సుఖేష్ లాయర్ విడుదల చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ కవితతో చేసిన చాటింగ్‌‌ను బయటపెట్టారు. కవితక్క-బీఆర్ఎస్‌ పేరుతో సేవ్ చేసిన నెంబర్‌తో సుఖేష్ చంద్ర చాటింగ్ చేశాడు. ఏకే, ఎస్‌జే, ఏపీ, సిస్టర్, ఘీ పేర్లతో కోడ్ రూపంలో చాటింగ్ జరిగింది. 15 కేజీల నెయ్యి(ఘీ) డెలివరీ చేశానని కోడ్ భాషలో పేర్కొన్నాడు. కోడ్ భాష విషయానికి వస్తే.. ఏకే (అరవింద్ కేజ్రీవాల్), ఎస్‌జే(సత్యేంద్ర జైన్), సిస్టర్(కవిత), ఘీ(డబ్బులు), ఏపీ (అరుణ్ పిళ్లై) అని పేర్కొన్నారు.