మనీ లాండరింగ్ కేసులో తీహార్ జైలులో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ మరో సంచలన లేఖను విడుదల చేశారు. ఇందులో బీఆర్ఎస్‌ నేతలతో తన వాట్సాప్ చాట్‌‌ను బయటపెడుతున్నట్టుగా తెలిపారు.

మనీ లాండరింగ్ కేసులో తీహార్ జైలులో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ మరో సంచలన లేఖను విడుదల చేశారు. ఇందులో ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి బీఆర్ఎస్‌ నేతలతో తన వాట్సాప్ చాట్‌‌ను బయటపెడుతున్నట్టుగా తెలిపారు. చాటింగ్‌కు సంబంధించిన ఆరు పేజీల లేఖను సుఖేష్ లాయర్ విడుదల చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ కవితతో చేసిన చాటింగ్‌‌ను బయటపెట్టారు. కవితక్క-బీఆర్ఎస్‌ పేరుతో సేవ్ చేసిన నెంబర్‌తో సుఖేష్ చంద్ర చాటింగ్ చేశాడు. ఏకే, ఎస్‌జే, ఏపీ, సిస్టర్, ఘీ పేర్లతో కోడ్ రూపంలో చాటింగ్ జరిగింది. 15 కేజీల నెయ్యి(ఘీ) డెలివరీ చేశానని కోడ్ భాషలో పేర్కొన్నాడు. 

కోడ్ భాష విషయానికి వస్తే.. ఏకే (అరవింద్ కేజ్రీవాల్), ఎస్‌జే(సత్యేంద్ర జైన్), సిస్టర్(కవిత), ఘీ(డబ్బులు), ఏపీ (అరుణ్ పిళ్లై) అని పేర్కొన్నారు. అయితే సుఖేష్‌ చెబుతున్న దానిలో ఎంతవరకు నిజం ఉందనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సుఖేష్ విడుదల చేసిన చాటింగ్‌ను పరిశీలిస్తే.. 

సుఖేష్.. అక్క, కొంత సమాచారం కావాలి
అవతలి వైపు.. ఇప్పుడే మీ మెసేజ్ చూశా
సుఖేష్.. నో ప్రాబ్లమ్ అక్కయ్య, ఏకే బ్రో ప్యాకేజ్ ఇవ్వమన్నారు.. అది నా వద్ద సిద్దంగా ఉంది. నేను దానిని జేహెచ్‌కు పంపాలా?
అవతలి వైపు.. నో, అరుణ్‌ను కాల్ చేయమని చెబుతాను. దానిని ఆఫీసుకు పంపాల్సి ఉంటుంది. 
సుఖేష్.. ఒకే అక్క మీరు ఎలా చెబితే అలా
అవతలి వైపు.. అతడు నీతో మాట్లాడతాడు
సుఖేష్.. ఎస్‌జే బ్రో ఈరోజే మీకు పంపించమని చెప్పారు.
అవతలి వైపు.. అవును
సుఖేష్.. నేను ప్రతిది కో ఆర్డినేట్ చేస్తాను
అవతలి వైపు.. థంబ్ అప్ సింబల్, నీ వైపు అంతా బాగానే ఉంది. మీ తండ్రి ఎలా ఉన్నారు.
సుఖేష్.. అడిగినందుకు థాంక్స్ అక్క, ఆయనకు కిమో జరుగుతుంది.
అవతలి వైపు..త్వరగా కోలుకోవాలి
సుఖేష్.. అవును అక్క, దేవుడు ఆ శక్తిని ఇస్తాడు.
అవతలి వైపు.. టేక్ కేర్, తర్వాత మాట్లాడుతాను. 
సుఖేష్.. ఒకే అక్క ఏనీ టైమ్, రెస్పెక్ట్ టూ కేసీఆర్ గారు.
అవతలి వైపు.. నమస్కారం సింబల్
సుఖేష్.. అక్క డెలివరీ అయింది
అవతలి వైపు.. ఒకే
సుఖేష్.. దయచేసి ఏకే లేదా ఎస్‌జేకు చెప్పండి
అవతలి వైపు.. మనీష్‌తో మాట్లాడాను
సుఖేష్.. ఒకే అక్క థాంక్స్


ఇక, గతంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు రాసిన లేఖలో సుఖేశ్‌ చంద్రశేఖర్‌ సంచలన విషయాలు వెల్లడించాడు. కేజ్రీవాల్‌, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్రజైన్‌ ఆదేశాలపై హైదరాబాద్‌ బీఆర్‌ఎస్‌ ఆఫీస్‌లో రూ.15 కోట్ల డబ్బులు ఎమ్మెల్సీ కారులో ముట్టజెప్పినట్టు ఆరోపించాడు. అరుణ్‌ రామచంద్ర పిళ్లై ద్వారా డబ్బులు అందచేసినట్టు లేఖలో పేర్కొన్నారు.