Asianet News TeluguAsianet News Telugu

టవల్ కట్టుకుని ఆన్‌లైన్‌ పాఠాలు, వెకిలి చేష్టలు: 500 మంది విద్యార్ధినులపై టీచర్ వేధింపులు

చెన్నైలోని ఓ స్కూల్‌లో 500 మంది విద్యార్ధులపై లైంగిక వేధింపులు కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంపై ఇప్పటికే విసిగి వేసారిన విద్యార్ధులు.. దుర్మార్గానికి పాల్పడిన టీచర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆన్‌లైన్ ఉద్యమాన్ని ప్రారంభించారు

Students of a Chennai School Accuse Teacher of Sexual Harassment ksp
Author
Chennai, First Published May 28, 2021, 10:27 PM IST

చెన్నైలోని ఓ స్కూల్‌లో 500 మంది విద్యార్ధులపై లైంగిక వేధింపులు కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంపై ఇప్పటికే విసిగి వేసారిన విద్యార్ధులు.. దుర్మార్గానికి పాల్పడిన టీచర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆన్‌లైన్ ఉద్యమాన్ని ప్రారంభించారు. టవల్‌తో కూర్చొని ఆన్‌లైన్ క్లాసులు చెబుతున్నాడని.. తమకు అసభ్యకరమైన మెసేజ్‌లు పెడుతున్నాడని వాపోయారు. టవల్‌తో కూర్చొని ఆన్‌‌లైన్ క్లాసులు చెబుతూ.. తమకు అసభ్యకరమైన పోస్ట్‌లు పెట్టేవాడని, పిచ్చిపిచ్చి బొమ్మలు చూపుతూ వేధించేవాడని కన్నీటిపర్యంతమయ్యారు.

Also Read:కీచక టీచర్ అరెస్ట్.. విద్యార్థులకు లైంగిక వేధింపులు....

టీచర్‌పై ఎన్ని ఫిర్యాదులు చేసినా స్కూల్ మేనేజ్‌మెంట్ పట్టించుకోలేదని.. విద్యార్ధినులు మండిపడ్డారు. మరోవైపు స్కూల్ పూర్వ విద్యార్ధినులు సైతం టీచర్‌పై డీన్‌కు ఫిర్యాదు చేశారు. 20 ఏళ్లుగా ఉద్యోగం వెలగబెడుతున్న ఈ టీచర్ ఎంతోమంది విద్యార్ధినులను లైంగికంగా వేధించినట్లు తెలిపారు. ఎక్కడ పడితే అక్కడ తాకేవారిని తెలిపారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే మార్కులు తగ్గిస్తానని బెదిరించేవాడని వాపోయారు. 

Follow Us:
Download App:
  • android
  • ios