పాఠశాల విద్యార్థినులను లైంగికంగా వేధించిన కీచక ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన తమిళనాడులో జరిగింది. చెన్నై లోని పద్మ శేషాద్రి బాలభవన్ పాఠశాలలో ఈ ఘటన జరిగింది. 

స్కూల్లో సీనియర్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న వ్యక్తి బాలికలు లైంగికంగా వేధించేవాడు. వారిని అనుచితంగా తాకడం, లైంగికంగా వేధించడం... అసభ్యంగా ప్రవర్తించడంతో.. విషయం తెలుసుకున్న పాఠశాల యాజమాన్యం అతన్ని సస్పెండ్ చేసింది. 

కాగా కీచక ఉపాధ్యాయుడిమీద కేసు పెట్టి అరెస్ట్ చేయాలని కోరుతూ బాలికల తల్లిదండ్రులు సోషల్ మీడియా ద్వారా ప్రచారంలో డిమాండ్ చేశాడు. దీంతో చెన్నై పోలీసులు కీచక ఉపాధ్యాయుడిమీద కేసు పెట్టారు. ఈ మేరకు మంగళ వారం అతన్ని అదుపులోకి తీసుకున్నారు.