Asianet News TeluguAsianet News Telugu

ఇదేం పైశాచికానందం.. కడుపుతో ఉన్న కుక్కను కొట్టి చంపిన విద్యార్థులు.. వీడియో వైరల్ అవడంతో కేసు నమోదు..

స్డూడెంట్లు ఓ మూగ జీవి పట్ల పైశాచికంగా ప్రవర్తించారు. గర్భంతో ఉన్న ఓ కుక్కను దారుణంగా కొట్టారు. దానిని చిత్ర హింసలకు గురి చేసి చంపేశారు. పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. 

Students beat a pregnant dog to death.. Police registered a case
Author
First Published Nov 20, 2022, 2:52 PM IST

ఢిల్లీలో ఓ దారుణం వెలుగులోకి వచ్చింది. కొందరు విద్యార్థులు కడుపుతో ఉన్న కుక్కను ఘోరంగా కొట్టి చంపారు. దాని మృత దేహాన్ని ఈడ్చుకుంటూ వెళ్లి పైశాచికానందం పొందారు. దీనికి సంబంధించిన వీడియోను కొందరు విద్యార్థులు రికార్డు చేశారు. అది బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవడంతో పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. 

'రాముడు అందరివాడు...'మతపరమైన విభజనపై ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

వివరాలు ఇలా ఉన్నాయి. నైరుతి ఢిల్లీలోని ఓఖ్లాలోని డాన్ బాస్కో టెక్నికల్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన దాదాపు 25 మంది విద్యార్థులు క్యాంపస్‌లోని టిన్ షెడ్ లోపల ఓ గర్భిణీ కుక్కపై దాడి చేశారు. దీనిని కొందరు విద్యార్థులు వీడియో తీశారు. అందులో ఓ విద్యార్థి లోపల ఆ శునకాన్ని దారుణంగా కొడుతున్నారు. బయటి నుంచి పలువురు విద్యార్థులు వేచి చూస్తూ నవ్వుతున్నారు. దానిని చంపాలని చెబుతున్నారు. చివరికి దానిని చిత్ర హింసలు పెట్టి చంపేశారు. 

కుక్క చనిపోయిన అనంతరం పక్కనే ఉన్న పొలాలకు మృత దేహాన్ని తీసుకెళ్లి అక్కడ దానిని ఈడ్చుకెళ్లారు. 15 నిమిషాల నిడివి గల ఈ భయంకరమైన  వీడియో శనివారం వైరల్‌గా మారింది.  ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ కావడంతో జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై న్యూ ఫ్రెండ్స్‌ కాలనీ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ)లోని సెక్షన్ 429, జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టంలోని సెక్షన్ల కింద కేసు పెట్టారు. 

మంత్రి మసాజ్ వీడియో వివాదం.. మనీష్ సిసోడియా క్షమాపణలు చెప్పాలని ఐఏపీ డిమాండ్.. ఎందుకంటే ?

దీనిపై పీపుల్స్ ఫర్ యానిమల్స్ (పీఎంఏ) అనే జంతు సంరక్షణ సంస్థకు చెందిన అంబికా శుక్లా వార్తా సంస్థ ‘పీటీఐ’తో మాట్లాడారు. విద్యార్థినుల ఈ క్రూరత్వాన్ని చూస్తుంటే భయంకరంగా ఉందని అన్నారు. గర్భిణిగా ఉన్న శునకాన్ని కొట్టి నవ్వుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. జంతువులపై ఇలా క్రూరత్వంగా ప్రవర్తించే వారు మహిళలు, పిల్లలపై కూడా హింసకు పాల్పడుతారని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయని అన్నారు. జంతువులపై హింసకు  పిల్లలపై, గృహహింసకు సంబంధం ఉందని అన్నారు.

న్యాయ శాఖ మంత్రి సమక్షంలో కొలీజియంపై సీజేఐ చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు.. ‘వారు భయపడుతున్నారు’

ఇదిలా ఉండగా.. కొద్ది రోజుల క్రితం ఘజియాబాద్‌లో కూడా ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. ఆ జిల్లాలో ముగ్గురు వ్యక్తులు ఓ కుక్కను చంపి వేలాడదీశారు. స్థానికుల ఫిర్యాదు మేరకు నిందితులందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా.. నవంబర్ 19న హైదరాబాద్‌లో రెండు కుక్క పిల్లలను చంపిన ఆరోపణలపై ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. అతడు ఈ హత్య ఘటనను వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేశాడు.
 

Follow Us:
Download App:
  • android
  • ios