Asianet News TeluguAsianet News Telugu

మంత్రి మసాజ్ వీడియో వివాదం.. మనీష్ సిసోడియా క్షమాపణలు చెప్పాలని ఐఏపీ డిమాండ్.. ఎందుకంటే ?

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా క్షమాపణలు చెప్పాలని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజియోథెరపిస్ట్ డిమాండ్ చేసింది. జైలులో మంత్రి సత్యేందర్ జైన్ మాసాజ్ చేసుకోలేదని, ఆయనకు ఫిజియోథెరపీ చేశారని సిసోడియా శనివారం చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఐఏపీ మండిపడింది. 

Minister massage video controversy.. IAP demands that Manish Sisodia apologize.. because?
Author
First Published Nov 20, 2022, 1:52 PM IST

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు, ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ మసాజ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రెండు రోజులుగా ఇదే విషయంలో బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రెండు పార్టీల నాయకులు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో శనివారం ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సత్యేందర్ జైన్ కు మద్దతుగా మాట్లాడారు. బీజేపీని విమర్శించారు. సత్యేందర్ జైన్ వెన్నుముక గాయానికి ఫిజియోథెరపీ చేయించుకున్నారని, మసాజ్ కాదని చెప్పారు. అయితే దీనిపై తాజగా ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజియోథెరపిస్ట్  మండిపడింది. సిసోడియా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. 

టార్గెట్ చేస్తారనే భయంతో న్యాయమూర్తులు బెయిల్ ఇవ్వడం లేదు.. సీజేఐ సంచలన వ్యాఖ్యలు

ఈ మేరకు ఐఏపీ (ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజియోథెరపిస్ట్) ఆదివారం ఓ ట్వీట్ చేసింది. అందులో ‘‘ మసాజ్ ను ఫిజియోథెరపీతో పోలుస్తూ మంత్రి చేసిన ప్రకటనను ఐఏపీ తీవ్రంగా ఖండిస్తోంది. మా వృత్తి, విద్యను కించపరిచే విధంగా ఆ వ్యాఖ్యలు ఉన్నాయి ’’ అని పేర్కొంది. ఆ ట్వీట్ లో ఐఏపీ ప్రెసిండెంట్ కు సంబంధించిన వీడియోను కూడా షేర్ చేశారు. ‘‘ మంత్రికి చేసింది ఫిజియోథెరపీ కాదు. ఇది నేను ఒక ఫిజియోథెరపీ ప్రొఫెసర్ గా, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజియోథెరపిస్ట్స్ ప్రెసిడెంట్ గా చెప్పగలను. ఇది ఫిజియోథెరపీని దిగజార్చే మార్గం. మేము ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాము. దీనికి మంత్రి లేదా ఎవరైనా క్షమాపణ చెప్పాలని మేము కోరుకుంటున్నాము ’’ అని అందులో ఆయన పేర్కొన్నారు.

తీహార్ జైలులో మంత్రి సత్యేందర్ జైన్ మసాజ్ చేయించుకుంటున్న వీడియో బయటకు విడులయ్యింది. ఈ వీడియోను గత నెల ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ కోర్టుకు అందించింది. అయితే ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో సెప్టెంబర్ 13వ తేదీన మంత్రి తన మంచంపై పడుకుని పేపర్లు చదువుతుండగా, అతని పక్కన కూర్చున్న ఒక వ్యక్తి తన పాదాన్ని మసాజ్ చేస్తున్నాడు. అలాగే బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ట్విట్టర్లో విడుదల చేసిన మరో వీడియోలో.. ఓ వ్యక్తి ఢిల్లీ మంత్రి కాళ్లను, వీపును రుద్దుతూ, తలకు మసాజ్ చేశారు.

ఖలిస్తానీ ఉగ్రవాది, గ్యాంగ్ స్టర్ హర్విందర్ సింగ్ రిండా మృతి.. ఎలాగంటే ? 

ఈ మసాజ్ వీడియోల వ్యవహారంపై ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీస్ సిసోడియా శనివారం స్పందించారు. సత్యేందర్ జైన్ వెన్నుముకకు గాయాలు అయ్యాయని, దానికి డాక్టర్లు రెండు సార్లు ఆపరేషన్ చేశారని చెప్పారు. డాక్టర్ల సూచనల మేరకే ఆయన జైలులో ఫిజియోథెరపీ చేయించుకున్నారని తెలిపారు. బీజేపీ ఒక రోగిని ఎగతాళి చేస్తోందని ఆరోపించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో, అలాగే ఎంసీడీ ఎన్నికల్లో గెలిచేందుకే బీజేపీ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని తెలిపారు. సత్యేందర్ జైన్ వీడియోలను చూపించి ఎన్నికల్లో విజయం సాధించాలని అనుకుంటున్నారని, ఇంత కంటే దారుణం మరొకటి ఉందని ఆరోపించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios